వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-08-03T11:07:09+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పె రుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు.

వణికిస్తున్న కరోనా

టెస్టుల కోసం ఆసుపత్రుల వద్ద బాధితుల నిరీక్షణ

లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ర్యాపిడ్‌ టెస్టులతో అంతంతమాత్రమే ఫలితం

ఎక్కువ మంది జనరల్‌ ఆసుపత్రికే మొగ్గు


నిజామాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పె రుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే కు టుంబంలో ఎక్కువ మందికి ఈ మహమ్మారి సోకు తోంది. మొదట కుటుంబంలో ఒక్కరికో, ఇద్దరికో వచ్చి ఆ తర్వాత ఇతరులకు వ్యాపిస్తోంది. లక్షణాలు ఉన్నవా రికి ముందే పరీక్షలు నిర్వహిస్తే వ్యాప్తి జరిగేది కాదు. మొదట వచ్చిన వారితో ఆసుపత్రులకు తిరిగిన వారికి, హోంక్వారంటైన్‌లో ఉంటున్న వారితో తిరిగిన వారికి ఇది ఎక్కువగా సోకుతోంది. నగరం పరిధిలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది. నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ, కంఠే శ్వర్‌, వినాయక్‌నగర్‌, మాలపల్లి, అర్సపల్లి, ముజాహిద్‌ నగర్‌, దుబ్బ, ఆర్యనగర్‌, ఖలీల్‌వాడి, నాందేవ్‌వాడతో పాటు ఇతర డివిజన్‌లలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది తమ అవసరాల కోసం బయటకు రావ డం, ఎక్కువసేపు ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. ఒక కుటుంబంలో ఒకరికి రాగానే మొత్తం అందరికీ పరీక్ష లు చేస్తే వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుంది.


కొనసాగుతున్న కరోనా పరీక్షలు

జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు అన్ని పీహెచ్‌సీలలో కరోనా పరీక్ష లు చేస్తున్నారు. జన రల్‌ ఆసుపత్రిలో పూర్తి స్థాయి పరీక్షలు చేస్తుండ గా పీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ టెస్టులను చేస్తున్నారు. లక్ష ణాలు ఉన్నా ర్యాపిడ్‌ టెస్టులలో కొంత మందికి బయ టపడడం లే దు. జనరల్‌ ఆసుపత్రిలో మళ్లీ చే యించుకుంటే పాజిటివ్‌ వస్తోంది. జిల్లా లో చాలా మందికి ఈ పరిస్థితి ఎదురవు తోంది. ర్యాపిడ్‌ టెస్టు నెగెటివ్‌ రాగానే చాలా మంది అప్పటి వరకు దూరంగా ఉన్న కుటుం బ సభ్యులతో కలిసి మాట్లాడుతున్నారు. మళ్లీ జ్వ రం, దగ్గు, జలుబు ఇతర లక్షణాలు బయట పడు తుండడంతో జనరల్‌ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుప త్రులలో పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్‌ వ స్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పరీక్షలు చేయిం చుకుంటుండంతో వారిలో కూడా ఈ లక్షణాలు బయ టపడుతున్నాయి. ఇలా పరీక్షల్లో తేడాలు వస్తుండడం తో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.


కొన్ని పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు పరీక్షలు నిర్వహించడం లేదు. లక్షణాలు లేవని తిప్పిపంపుతున్నారు. మరి కొ న్ని కేంద్రాలలో తమకు తెలిసిన వారికి పరీక్షలు నిర్వ హిస్తున్నారు. కొన్నిచోట్ల లక్షణాలు లేవని తిప్పి పంపిన రెండు మూడు రోజుల్లోనే సీరియస్‌ అవుతుండడంతో తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. కొన్ని పీహెచ్‌సీల లో పరీక్షల నిర్వహణకు తగిన సిబ్బంది లేరని, కిట్లు లే వని తిప్పి పంపుతున్నారు. కలెక్టర్‌కు ఎప్పటికప్పుడు ఆ యా గ్రామాల వారు ఫిర్యాదులు చేస్తుండడంతో ఆయ న ఆదేశాల మేరకు పరీక్షలు చేస్తున్నారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రికి మాత్రం నిత్యం ఎక్కువ మంది వస్తుండ డంతో లక్షణాలు లేనివారిని తిప్పి పంపుతున్నారు. ఇం కా మిషన్‌ అప్‌డేట్‌ కాకపోవడంతో వందకుపైగా టెస్టు లు చేస్తున్నారు. మిషన్‌ పూర్తిస్థాయి అప్‌డేట్‌ అయితే 300లకు పైగా టెస్టులు చేసే అవకాశం ఉంది. 


సమాచారం విడుదలలో అస్పష్టత

జిల్లాలో ఏయే ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఎక్కువ గా ఉంది, ఏ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయో స్పష్టమైౖన వివరాలు అధికారులు విడుదల చేయకపోవ డం వల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్‌ వచ్చిన తర్వాత వివరాలను తీసుకుంటున్న అధికారులు ఆ ఇంటి పరిధిలో స్ర్పే చేయడంతో పాటు ఇతర చర్య లు తీసుకోవాలి. జిల్లాలో కొన్ని చోట్ల చేస్తున్నా హోంక్వా రంటైన్‌లపై దృష్టి సారించడం లేదు. ఆ డివిజన్‌ లేదా వార్డు, గ్రామం పరిధిలో ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఫోన్‌ల ద్వా రా వివరాలు తీసుకుంటున్నా ప్రతీరోజు పరిశీలిస్తే కట్ట డి  చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఇతరు లు తక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. 


అవసరమైనవారందరికీ పరీక్షలు

జిల్లాలో అవసరం ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నామని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తె లిపారు. లక్షణాలు ఉన్న వారికే చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో టెస్టులు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ రాగా నే ప్రైమరీ కాంటాక్టులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఎవరికైనా పరీక్షల వద్ద సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-08-03T11:07:09+05:30 IST