కరోనా విలయం

ABN , First Publish Date - 2020-08-02T10:25:21+05:30 IST

కరోనా విలయం

కరోనా విలయం

- ఒకే రోజు 233 కేసులు నమోదు


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/(వనపర్తి-ఆంధ్రజ్యోతి)/ గద్వాల క్రైం/నవాబ్‌పేట/అయిజ/వెల్దండ/నారాయణపేట క్రైం/ జడ్చర్ల/కల్వకుర్తి అర్బన్‌, ఆగస్టు 1 : కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమ వుతోంది. ఊహించని రీతిలో కేసులు నమోదవుతుండటంతో భ యాందోళన కలిగిస్తున్నది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జి ల్లాలో 233 కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 72 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. నారాయణపేట జిల్లా ఊట్కూరులో ఒకే కు టుంబంలోని ఐదుగురికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తున్నది. 


పాలమూరులో 47..

మహబూబ్‌నగర్‌లో శనివారం కొత్తగా 47 పాజిటివ్‌ కేసులు న మోదు కాగా, అందులో ఒక్క జడ్చర్లలోనే 11 మందికి పాజిటివ్‌ అని తేలింది. అందులో మూసా ట్యాంకు, పాత బజార్‌లోని హనుమాన్‌ టెం పుల్‌ ఏరియా, ఎర్రసత్యం కాలనీ, ప్రశాంత్‌నగర్‌, భార్గవి హైట్స్‌, వి ద్యానగర్‌ కాలనీ, క్లబ్‌ రోడ్డు, రంగారావు తోట, బీసీ హాస్టల్‌ క ల్వకుర్తి రోడ్డు, జడ్చర్ల టౌన్‌లలో వ్యక్తులకు వైరస్‌ సోకింది. గం డీడ్‌ మండలం రెడ్డిపల్లిలో రెండు, అడ్డాకుల మండలం జా నంపేటలో రెండు, కోయిలకొండ మండలం మణికొండలో ఒక టి, భూత్పూర్‌, సీసీ కుంట మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి, నవా బ్‌పేటలో ఒక కేసు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ మండ లం బొక్కలోనిపల్లి గ్రామంలో నలుగురికి, బండమీదిపల్లిలో ఇ ద్దరికి, అడివివెంకటాపూర్‌లో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అయ్యిం ది. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో రెండు, బోయపల్లిగేట్‌, హౌసింగ్‌బోర్డు, శ్రీనివాసకాలనీ, టీచర్స్‌కాలనీ, కుమ్మరివాడ, వేపూరిగేలి, మోతీనగర్‌, సంజయ్‌నగర్‌, టీడీ గుట్ట, మధు రానగర్‌, న్యూప్రేమ్‌నగర్‌, లక్ష్మీనగర్‌కాలనీ, క్రిష్టియన్‌పల్లిలో ఒకొక్కటి రాగా, మర్లులో ముగ్గురు, పాతపాలమూరులో ముగ్గురి చొప్పున 21 మందికి పాజిటివ్‌ వచ్చింది.


గద్వాలలో 72..

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోజే 72 కేసులు నమో దయ్యాయి. జిల్లా కేంద్రంలోని ర్యాపిడ్‌ ల్యాబ్‌లో 26 కేసులు, కొవిడ్‌ ల్యాబ్‌లో 14 కేసులు రాగా, అందులో జిల్లా కేంద్రానికి చెందిన 33 మందికి పాజిటివ్‌ అని తేలింది. మిగిగిన ఏడు కే సులు మల్దకల్‌, షేక్‌పల్లి, మానవపాడు, రామాపు రంలో నమోదయ్యాయి. అలాగే అలంపూర్‌ లో 17 మందికి, అయిజలో పది మందికి, ఇటిక్యాలలో ఇద్దరికి, ఉప్పేరులో ము గ్గురికి పాజిటివ్‌ అని తేలింది. కాగా, జిల్లా కేంద్రంలోని సుంకులమ్మమె ట్టు ప్రాంతానికి చెందిన ఒకరు, ఉండవల్లిలో మరొకరు కరోనాతో మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


నారాయణపేటలో 17..

నారాయణపేట జిల్లా వ్యాప్తం గా 17 కేసులు నమోదయ్యాయి. ఇం దులో ఊట్కూరుకు చెందిన ఒకే కు టుంబంలోని ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. జిల్లా కేంద్రంలోని శాతవాహానకాల నీలో ఒకరికి, బైరంకొండ గ్రామంలో ఒకరికి, మరికల్‌ మం డలం వెంకటాపూర్‌లో ఇద్దరికి, మక్తల్‌లో ముగ్గురికి, సోమేశ్వరబండలో ఒక రికి, ఖానాపూర్‌లో ఒకరికి, కోస్గిలో ఒకరికి, గుండుమాల్‌లో ఒకరికి, మద్దూ ర్‌లో ఒకరికి కరోనా సోకింది.


వనపర్తిలో 27..

వనపర్తి జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో నే 19 మందికి, ఘన్‌పూర్‌లో ఒకరికి, ఆత్మకూర్‌ ముగ్గురికి, మదనాపురంలో ఒకరికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.


నాగర్‌కర్నూల్‌లో 70.. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొత్తం 70 కేసులు నమోదయ్యాయి. ఇందులో కల్వకుర్తి నియోజకవర్గంలోనే 20 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-02T10:25:21+05:30 IST