కోరలు చాస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-06T09:50:10+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రతాపాన్ని చూపుతోంది. ఆదివారం ఒక్కరోజే 149కొత్త కేసులు న మోదయ్యాయి.

కోరలు చాస్తున్న కరోనా

తెనాలిలో నాలుగునెలల చిన్నారికి పాజిటివ్‌  ఫ ఏడాదిన్నర బాలికకు కూడా.. ఫ పొన్నూరు, చిలకలూరిపేటలో నలుగురు హోంగార్డులకు


తెనాలి, తాడేపల్లిలో వైరస్‌ విజృంభణ ఫ గుంటూరులో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు ఫ జిల్లాలో కొత్తగా నమోదైన కేసులు 149


గుంటూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ప్రతాపాన్ని చూపుతోంది. ఆదివారం ఒక్కరోజే 149కొత్త కేసులు న మోదయ్యాయి. గుంటూరు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిచెందుతోంది. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విస్త్రృతంగా ఉంది. నల్లచెరువులో ఇప్పటికే 60కి పైగా పాజిటివ్‌ కేసులు రావడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అలానే బ్రాడీపేటలో 20 పాజిటివ్‌ కేసులు దాటడంతో ఈ ఏరి యాని కట్టడి చేశారు. ఏటీ అగ్రహారంలోనూ వీధివీధినా బ్యారికేడింగ్‌ చేసి కంటైన్‌మెంట్‌ చేశారు. తాజాగా సంగడిగుంటలో కేసులు ప్రబలుతుండటంతో ఆ ప్రాంతాన్ని కూడా కంటైన్‌మెంట్‌ జోన్‌లో చేర్చాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది.


మంగళగిరి పట్ట ణంలోని ఇందిరానగర్‌ ఏరియాలో ఓ వ్యక్తికి, ఎల్బీనగర్‌ ప్రాంతంలో ఓ మహిళకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్టు డాక్టర్‌ అంబటి వెంకట రావు తెలిపారు. రెంటచింతలలోని ఎర్రపాలెం ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల వృద్ధురాలికి  పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 


రాజుపాలెం గ్రామంలోని ఓ యువకుడికి కరోనా సోకింది. ఆ యువకుడు సత్తెనపల్లిలోని వైద్యులకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. నకరికల్లులో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణయిం ది. ఇటీవల పిడుగురాళ్ల ఆర్టీసీ బస్‌డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఆయన భార్యకు, కుమార్తెకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.  


తాడికొండ మండలం పొన్నెకల్లులో 80 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ వచినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొల్లిపర మండలంలోని మున్నంగి ముస్లిం కాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 


సత్తెనపల్లిలో కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని 22వ వార్డుకుచెందిన ఓ యువకుడికి, వడ్డవల్లిలో దంపతులకు, రఘురాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తికి, చెన్నై నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మండలంలోని పెదమక్కెనలో ఓ పాజిటివ్‌ కేసు నమోదైంది. అతను ఓ వ్యక్తి నరసరావుపేటలోని ఇసుక డంపింగ్‌ యార్డులో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. 


దాచేపల్లి మండలంలో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్యా లయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇద్దరు, కేసానుపల్లిలో 75 ఏళ్ల వృధ్ధురాలికి కరోనా పాజ్‌టివ్‌ లక్షణాలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.  


పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం మరో ఐదు కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. గంగమ్మగుడి వెనుకబజారులో ఒకటి, భవానినగర్‌లో రెండు, కల్లం టౌన్‌షిప్‌లో ఒకటి, ఎస్టీ కాలనీలో ఒక  కేసు నమోదయ్యాయి. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావటంతో అప్రమత్తమైన వైద్యాధికారులు శనివారం ఎమ్మెల్యేకు, గన్‌మ్యాన్‌లకు కరోనా పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే, మరో నలుగురికి నెగెటివ్‌ రిపోర్టు రాగా ఓ గన్‌మ్యాన్‌కు కోవిడ్‌ సోకినట్లు అధికారులు నిర్థారించారు. 


మాచర్ల పట్ట ణంలో ఆదివారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. ఇటీవల 12వ వార్డుకు చెందిన ఓ ఉపాధ్యాయునికి పాజి టివ్‌ రాగా అతని కుటుంబసభ్యులకు ప రీక్షలు నిర్వహించారు. అతని భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పాజి టివ్‌గా తేలింది. 4వ వార్డుకు చెందిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇటీవల మాచర్ల పట్టణానికి వచ్చాడు. ఇతనితోపాటు ఇం టిలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమా చారం. పొన్నూరు మండలంలోని మునిపల్లె, మన్నవ గ్రామాలకు చెందిన ఇద్దరు రైల్వే హోంగార్డులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పట్టణంలోని 23 వార్డుకు చెందిన మహిళకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు అధికారులు  తెలిపారు. ఆ మహిళ  విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.

 

బాపట్ల పట్టణంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంలో నరాలశెట్టివారిపాలెంకు చెందిన ఓ యువకుడు తవ్వకాల్వ వద్ద మహాలక్ష్మి చెట్టు వద్ద ఓ యువకుడు కరోనా బారినపడ్డారు. పెదకాకాని మండల పరిధిలోని కొప్పురావూరు గ్రామ పరిధిలో మూడేళ్ల బాలుడికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. తుళ్లూరులో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పట్టణంలో ఏడుగురికి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. పట్టణంలోని ఏనుగుల బజార్‌లో రెండు, సాయినగర్‌లో రెండు, కాకతీయనగర్‌లో ఒకటి, రామిరెడ్డిపేట పాలకేంద్రం ప్రాంతంలో ఒక కేసు నమోదయ్యాయి.  నరసరావుపేట మండలం చిన తురకపాలెం గ్రామంలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. 


 పోలీస్‌ సర్కిల్‌లో విస్తరిస్తున్న కరోనా

 చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో కొవిడ్‌-19 విస్తరిస్తోంది. ఆదివారం నాటికి పాజిటివ్‌ సోకినవారి సంఖ్య ఏడుకు చేరింది. మొదట రూరల్‌ సీఐకి పాజిటివ్‌ సోకగా రెండు రోజుల క్రితం యడ్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు, నాదెండ్ల పోలీసు అధికారికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రూరల్‌ సీఐ కుటుంబ సభ్యులు నలుగురు కొవిడ్‌ బాధితులవడంతో వారిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆదివారం చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐకి డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులకు, ఓ కానిస్టేబుల్‌క పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  


తెనాలిలో 11 మందికి..

తెనాలి పట్టణంలో ఆదివారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నందులపేటలో రెండు, జగ్గడిగుంటపాలెంలో రెండు, చెంచుపేటలోని అపార్ట్‌మెంట్‌లో 1, మారీసుపేటలో నాలుగు, రామలింగేశ్వరపేట, గంగానమ్మపేటలో ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి. జగ్గడిగుంటపాలెంలో ఒక కుటుంబంలో నాలుగు నెలల చిన్నారి, 21 నెలల వయసున్న బాలికకు జ్వరం వస్తుండటంతో తల్లి తనతో పాటు వారికి కూడా పరీక్షలు చేయింది. పిల్లలిద్దరూ వైరస్‌ బారిన పడగా తల్లికి నెగిటివ్‌ వచ్చింది. మహిళ భర్త దూరప్రాంతంలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ ఇంటికి వచ్చి వెళుతున్నారు. ఈ కారణంగానే వైరస్‌ సోకినట్లు భావిస్తున్నారు. 


తాడేపల్లిలో 17 పాజిటివ్‌ కేసులు

తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో ఆదివారం 17 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉండవ ల్లి గ్రామంలో గతంలో పాజి టి వ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాం టాక్టులకు సంబంధించి ఐదుగురికి, పట్టణంలోని బైపాస్‌ ఏరి యా, సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో 12మందికి పాజి టివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. 


 రొంపిచర్లలో ఓ కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దుగ్గిరాల మండలం చిలు వూరులో 14 ఏళ్ల బాలికకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఆమెను మంగళగిరి ఎన్నారై వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-07-06T09:50:10+05:30 IST