Abn logo
May 24 2020 @ 04:03AM

కరోనాతో.. బిక్కవోలు బెంబేలు!

బిక్కవోలు, మే 23: బిక్కవోలులో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవ డంతో గ్రామంలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేవుడిమాన్యంలో శుక్రవారం ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెల్సిందే. మామిడాడలో మృతి చెందిన వ్యక్తి మేనకోడలు (50), మనుమడు (17)కు శుక్రవారం కొవి డ్‌ నిర్ధారణ కాగా మరో ముగ్గురు ఆమె భర్త (54), కుమార్తె (36), మనుమరాలు (16)కు శనివారం కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. ఇదే గ్రామానికి చెందిన మరో నలుగురికి కూడా కొవిడ్‌ సోకింది. అయితే వీరు ప్రస్తుతం మామి డాడలో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడుగురిలో నలుగురు ఇప్పటికే కాకినాడ జేఎన్‌టీయూ క్వారంటైన్‌లో ఉండగా, మిగిలిన ముగ్గురిని రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌కు తరలించినట్టు బిక్కవోలు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ చెప్పారు. ఇక గ్రామంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రావడంతో, ఇప్పటికే రెడ్‌జోన్‌ అమలులో వున్న దేవుడిమాన్యంతోపాటు కొత్తపేట ప్రాంతాన్ని కూడా రెడ్‌జోన్‌గా ప్రకటించామని ఎస్‌ఐ పి వాసు తెలిపారు. ఇక గ్రామంలోకి ఇతరులు  ప్రవేశించకుండా, వీరు బయటకెళ్లకుండా పంచాయతీ సిబ్బంది బారికేడ్లు నిర్మించారు. జనం రోడ్లపై కర్రలు కట్టుకున్నారు.

Advertisement
Advertisement