Abn logo
May 24 2020 @ 03:59AM

కొంపముంచిన హోటల్‌

కొవిడ్‌తో మరణించిన వ్యక్తి వల్లే వ్యాప్తి 

16 వేల జనాభాలో రిస్క్‌ గ్రూప్‌ కింద 60 ఏళ్లు దాటిన వారందరికి కొవిడ్‌ టెస్ట్‌లు

ఆ వయస్సు వారు 3 వేల మంది ఉంటారని అంచనా.. నేటి నుంచే పరీక్షలు

ఆ హోటల్‌కు వచ్చిన వారి గురించి ఆరా

లాక్‌డౌన్‌ సమయంలో హోటల్‌ నడపడానికి అనుమతి ఇచ్చిందెవరు?


కాకినాడ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో తొలిసారిగా ఒకేరోజు 20 కొవిడ్‌ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇందులో నలుగురికి వైరస్‌ లక్ష ణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ గురువారం మృతి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ద్వారా వ్యాపించినవిగా వైద్యులు నిర్ధారించారు. అటు శుక్రవారం నిర్ధారించిన ఎనిమిది మందికీ ఈయన ద్వారానే వైరస్‌ వ్యాపించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో సదరు మృతుడి ద్వారా 28 కేసులు నమోదవగా, మృతుడి స్వస్థలమైన పెదపూడి మండలం మామిడాడలో 22 కేసులు నిర్ధారణ అయ్యాయి.


దీంతో ప్రభుత్వం అప్రమ త్తమైంది. కొవిడ్‌ మృతుడి శరీరంలో వైరస్‌ తీవ్రంగా ఉండి కన్నుమూసిన నేపథ్యంలో రిస్క్‌ గ్రూప్‌ కింద మామిడాడలో 60 ఏళ్లు దాటిన వారందరిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని ఆదేశించారు. దీంతో మామి డాడలో 16 వేల జనాభాలో 60 ఏళ్లు దాటిన వారు మూడు వేలు ఉంటారని వైద్యశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వీరందరికి పరీక్షలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా గురువారం ఎనిమిది కేసులతో అప్రమత్తమై శనివారం 400 పరీక్షలు జరిపారు. ఫలితాలు వెల్లడి కావలసి ఉంది. మరోవైపు హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేసిన వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందడంతో ఇక్కడకు గడిచిన కొన్ని రోజులుగా అల్పాహారం, టీ కోసం ఎవరెవరు వచ్చార నేది గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.


ఇక్క డకు అత్యధికంగా వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, స్థానిక బ్యాంకు సిబ్బంది, కిరాణా దుకాణాల్లో పని చేసిన వారందరిని వైద్యులు అప్రమత్తం చేశారు. తక్షణం అంతా కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోవాలని ప్రచారం చేశారు. ఇదిలాఉంటే లాక్‌డౌన్‌ సమయంలో మామిడాడలో హోటల్‌ అసలు ఎలా తెరిచారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఓ పోలీసు అధికారి మామూళ్లు తీసుకుని వ్యాపారం చేసుకోవడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అటు పీహెచ్‌సీ స్థాయిలో శాంపిళ్లు సేకరించే పైలట్‌ ప్రాజె క్టులో జిల్లాను ప్రభుత్వం చేర్చింది. కొవిడ్‌పై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. త్వరలో వసతులను సమకూర్చనున్నారు.

Advertisement
Advertisement