ఉదయం 11 వరకే..

ABN , First Publish Date - 2020-03-30T10:13:43+05:30 IST

కరోనా వై రస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల దుకాణాల సమయాన్ని ఉదయం 11 గంటల వరకు ప్రకటించినట్లు అర్బన్‌ పోలీస్‌ అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు.

ఉదయం 11 వరకే..

నిత్యావసర దుకాణాలు తెరిచేందుకు డెడ్‌లైన్‌

ఆ తర్వాత దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు


గుంటూరు, మార్చి 29 : కరోనా వై రస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల దుకాణాల సమయాన్ని ఉదయం 11 గంటల వరకు ప్రకటించినట్లు అర్బన్‌ పోలీస్‌ అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అందుబాటులో ఉంటాయన్నారు. ఆ సమయం తరువాత ఎవరైనా దుకాణాలు తెరిచి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలనుకుంటే 11 గంటల లోపు మాత్రమే రోడ్లపైకి రావాలన్నారు.


ఆ తరువాత  నిత్యావసర సరుకుల నెపంతో రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు తప్పవన్నారు. వ్యాపారులు రోటేషన్‌ పద్ధతిలో వ్యాపారం చేసుకోవాలన్నారు. కూరగాయలకు సంబంధించి రెవెన్యూ, మున్సిపల్‌ నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే విక్రయించుకోవాలన్నారు. నిర్థేశించే సమయంలో ఆయా సమయాల్లో బైక్‌పై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. లాక్‌డౌ న్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు న మోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రా మకృష్ణ బందోబస్తును పరిశీలించి తగు ఆ దేశాలు ఇచ్చారు. వాహన చోదకులు ని బంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


నిబంధనలు ఉల్లంఘించిన 67 వాహనాలు స్వాధీనం

అర్బన్‌ పరిధిలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య నిబంధనలు ఉల్లంఘించిన 67 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా 10 మందిపై 13 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు అర్బన్‌ జిల్లా పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తదితర 1300 వాహనాలను సీజ్‌ చేయడం జరిగిందన్నారు. 


Updated Date - 2020-03-30T10:13:43+05:30 IST