215 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-15T06:07:15+05:30 IST

215 కరోనా కేసులు

215 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, మే 14: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య దగ్గడం లేదు. వందల సంఖ్యలో పాజి టివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మండల అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో 817 టెస్టులు నిర్వహించగా 215 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.శుక్రవారం 237 మందికి రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వేయగా చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల పరిధిలో ఇద్దరు మృతి చెందారు. పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రాయపర్తిలో 20, దామెర, కేశవాపూర్‌లో 19 చొప్పున, సంగెంలో 16, ఆత్మకూరు, చెన్నారావుపేటలో 15 చొప్పున, వర్ధన్నపేటలో 14, గీసుగొండ, పరకాల, నర్సంపేట లో 13 చొప్పున, పర్వతగిరిలో 12, మేడపల్లిలో 10, దుగ్గొం డిలో ఎనిమిది, నెక్కొండ,  అలంకానిపేట, నల్లబెల్లిలో ఏడే సిచొప్పున, బానోజీపేటలో ఐదు, నడికూడలో రెండు కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-05-15T06:07:15+05:30 IST