కరోనా చిదిమిన బతుకులు!

ABN , First Publish Date - 2021-05-08T09:10:40+05:30 IST

జీవనాధారం కోసం పొట్ట చేతబట్టుకుని పట్టణానికి వచ్చిన ఓ పేద కుటుంబాన్ని కరోనా మహమ్మారి చిదిమేసింది. నెల్లూరు జిల్లా జలదంకికి చెందిన పెసల మాల్యాద్రి శ్రీనివాసులు, అనురాధ (30) దంపతులది నిరుపేద కుటుంబం

కరోనా చిదిమిన బతుకులు!

బలవన్మరణానికి భార్యాభర్తల యత్నం.. భార్య మృతి..


కావలి రూరల్‌, మే 7: జీవనాధారం కోసం పొట్ట చేతబట్టుకుని పట్టణానికి వచ్చిన ఓ పేద కుటుంబాన్ని కరోనా మహమ్మారి చిదిమేసింది. నెల్లూరు జిల్లా జలదంకికి చెందిన పెసల మాల్యాద్రి శ్రీనివాసులు, అనురాధ (30) దంపతులది నిరుపేద కుటుంబం. వారికి 11 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. గత నెల 25న ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పిల్లలను తెలిసిన వారింటికి పంపిఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అనురాధకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. భర్తకు చెప్పడంతో ఆయన 108, 104 సేవల కోసం ప్రయత్నించాడు. వారు స్పందించలేదు. ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మాల్యాద్రి భార్య చేయి మణికట్టును కత్తితో కోశాడు. అనంతరం మద్యం సేవించి తాను కూడా ఎడమ చేతిని కోసుకుని షాపు వద్దకు వెళ్లి నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా భార్య విగత జీవిగా పడిఉంది. దీంతో మాల్యాద్రి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు.

Updated Date - 2021-05-08T09:10:40+05:30 IST