కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-04-16T06:54:25+05:30 IST

కరోనా విజృంభణ

కరోనా విజృంభణ

అర్ధ సెంచరీ దాటిన కేసులు 

ఉధృతమైన సెకండ్‌వేవ్‌ 

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌

ములుగు, ఏప్రిల్‌ 15: ములుగు జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమైంది.  వారంరోజులుగా సగటున రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా అర్ధ సెంచరీ దాటాయి. 54 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 18 ఆస్పత్రుల్లో 1,890 మందికి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయగా  ములుగు మండలంలో 30 మందికి, ఏటూరునాగారంలో నలుగురికి, వెంకటాపురం (నూగూరు)లో నలుగురికి, వెంకటాపూర్‌(రామప్ప)లో 10 మందికి, గోవిందరావుపేటలో ఇద్దరికి, మంగపేట మండలంలో నలుగురికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య తెలిపారు. మరో 28 మంది నుంచి ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో నమూనాలు సేకరించి కేఎంసీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. ఓ పక్క కరోనా వ్యాప్తి తీవ్రం గా ఉన్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. అత్యధికంగా ఈ ఒక్కరోజే 2,803 మందికి టీకా వేశారు. సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాలను ఎంపిక చేసి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తున్నారు. ఇన్ని రోజులు వ్యాక్సిన్‌పై సందేహాలతో దూరంగా ఉన్న ప్రజలు కరోనా భయంతో టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. గురువారం 2,789 మంది మొదటి డోసు, 14 మంది రెండో డోసు టీకా వేసుకున్నారని డీఎంహెచ్‌వో తెలిపారు. మల్లంపల్లి, కాసిందేవిపేట, తదితర గ్రామాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

భూపాలపల్లిలో 53...

భూపాలపల్లి: జిల్లాలో మరో 53 మంది కరోనా బారిన ప డ్డారు. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో 1,329 మందికి పరీక్షలు చేయ గా ఈ మేరకు నిర్ధారణ అయినట్లు జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

5,320 మందికి టీకా..

జిల్లాలో 5,320 మందికి కరోనా టీకా చేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ మమతాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు,  సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మొత్తం 5,198 మంది 45 సంవత్సరాలుపైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్‌ వేసినట్టు పేర్కొన్నారు.  122 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌  టీకా తీసుకున్నట్టు తెలిపారు.


Updated Date - 2021-04-16T06:54:25+05:30 IST