ఆధునిక యంత్రాలతో మూలన పడిన కులవృత్తి

ABN , First Publish Date - 2022-01-24T04:59:54+05:30 IST

ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి మూలనపడిందని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల భిక్షపతి అన్నారు.

ఆధునిక యంత్రాలతో మూలన పడిన కులవృత్తి
విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడుతున్న భిక్షపతి

- విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి


బాలానగర్‌, జనవరి 23 : ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి మూలనపడిందని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల భిక్షపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రం లోని అయ్యప్పస్వామి దేవాలయంలోని హాల్‌లో ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మ ణుల సమావేశంలో మాట్లాడారు. కర్రలతో చేసే నాగళ్లకు బదులు ట్రాక్టర్లు రావడంతో విశ్వబ్రాహ్మణులకు పనులు దొరకక అనేక కష్టాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. ఆధునిక యంత్రాలతోపాటు మార్కెట్‌లో అన్ని రకాల రెడిమేడ్‌ వస్తువులు దొరకడంతో తమకు సరైన సనులు లభించక దినసరి కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇళ్లు నిర్మించాలంటే విశ్వబ్రాహ్మణులను సంప్రదించే వారని, ఇంటికి దరువాజలు, కిటికీలు, దూలా లు, వాట్లు చిలుకచెక్కలతో పాటు ఇంటికి సంబంధించిన వస్తువులను తయారు చేసి ఇచ్చేవారమని అన్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ కోసం రెండు వందల కోట్లు కేటాయిస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. వైస్‌ఎంపీపీ వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మ ణులు ఆర్థికంగా, సామాజికంగా ఎద గాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవా లని కోరారు. అనంతరం మండలంలోని విశ్వబ్రాహ్మణులకు మండల కార్యవర్గ నియామకపత్రాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి, కార్యదర్శి సోమాచారి, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, సలహాదారులు చక్రంచారి, వడ్ల వెంకటాచారి, మండల అధ్యక్షుడు మనోహరచారి, ప్రధాన కార్యదర్శి రవిచారి, శ్రీనివాసచారి, కుమార్‌ చారి, రవిచారి, కిరణ్‌చారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:59:54+05:30 IST