కార్న్‌ సబ్జీ

ABN , First Publish Date - 2020-07-25T17:57:16+05:30 IST

స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు -

కార్న్‌ సబ్జీ

కావలసినవి: స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, టొమాటోలు - మూడు, నూనె - సరిపడా, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - ఐదారు పలుకులు, క్రీమ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, మెంతి పొడి - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ: పావుకప్పు గోరువెచ్చటి పాలలో జీడిపప్పును నానబెట్టాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి పేస్టుగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి స్వీట్‌ కార్న్‌ను ఉడికించాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్న మంటపై ఉడికిస్తూ ఉండాలి. జీడిపప్పు పేస్టు వేసి కలపాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న స్వీట్‌కార్న్‌ వేయాలి. ఒక కప్పు నీళ్లు పోసి మరో పది నిమిషాల పాటు ఉడికించాలి. క్రీమ్‌ వేసి, గరంమసాలా, మెంతిపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి. రోటీ లేదా చపాతీలోకి ఈ సబ్జీ ఎంతో రుచిగా ఉంటుంది.


Updated Date - 2020-07-25T17:57:16+05:30 IST