కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్- కప్పు, బిర్యానీ ఆకు- ఒకటి,లవంగాలు- మూడు, మిరియాలు- నాలుగు, యాలకులు- రెండు, ఉల్లి గడ్డ ముక్కలు - ముప్పావుకప్పు, పసుపు- చిటికెడు, ఆలుగడ్డ ముక్కలు- అర కప్పు, పచ్చి బఠానీ- అర కప్పు, కొత్తిమీర పేస్టు కోసం, కొత్తిమీర తరుగు - అర కప్పు, పచ్చి మర్చి - మూడు, అల్లం- అర ఇంచు, ఎండు కొబ్బరి తురుము- రెండు స్పూన్లు, వెల్లుల్లి పేస్టు - స్పూను, ధనియాలు, ఆవాలు - చెరో అరస్పూను, నీళ్లు, ఉప్పు, నూనె-తగినంత.
తయారుచేసే విధానం: బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి, అల్లం, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, ఆవాల్ని మిక్సీలో రుబ్బిపెట్టుకోవాలి. రెండు స్పూన్ల నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఓ ప్రెషర్ కుక్కర్లో కాస్త నూనె వేసి లవంగాలు, మిరియాలు, యాలకులను వేసి వేయించాలి. ఇందులోనే ఉల్లిముక్కల్ని కూడా చేర్చి బంగారు రంగులోకి మారాక కొత్తిమీర రుబ్బు, పసుపు వేయాలి. రెండు నిమిషాల తరవాత ఆలు ముక్కలు, బఠానీని కూడా జతచేయాలి. అన్నిటినీ కలుపుతూ బాస్మతి బియ్యం, తగినంత నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. రెండు విజిల్స్ తరవాత స్టవ్ కట్టేయాలి. వేడి వేడి కొత్తిమీర రైస్ బాగుంటుంది.