Abn logo
Oct 14 2021 @ 07:35AM

chennai: లంచం తీసుకున్న డిప్యూటీ బీడీఓ అరెస్టు

ఐసిఎఫ్‌(చెన్నై): ఇళ్ల స్థలాలకు అనుమతిచ్చేందుకు రూ.9 వేలు లంచం పుచ్చుకున్న డిప్యూటీ బీడీఓను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు రాజరాజన్‌నగర్‌కు చెందిన ఇంజనీర్‌ ఆనందన్‌ తన పేరు, తల్లి పేరిట ఉన్న మూడు ప్లాట్లకు అనుమతి కోసం యూనియన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పరిశీలించిన డిప్యూటీ బీడీఓ స్వామినాథన్‌ రూ.9 వేలు లంచం అడిగాడు. ఈ విషయమై ఆనందన్‌ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సలహా మేరకు స్వామినాథన్‌కు సోమవారం రాత్రి ఆనందన్‌ లంచం ఇస్తుండగా, అక్కడే మాటువేసిన పోలీసులు స్వామినాథన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...