biometric ప్రధాన సమాచారాన్ని పంచుకోబోం.. ఢిల్లీ హైకోర్ట్‌కి UIDAI స్పష్టం

ABN , First Publish Date - 2022-05-06T00:31:15+05:30 IST

న్యూఢిల్లీ: Adhar act కింద Biometricకు సంబంధించి తాము సేకరించిన ప్రధాన సమాచారాన్ని ఎవరితోనూ, ఎలాంటి కారణమైనా పంచుకోబోమని UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) Delhi high courtకు తెలిపింది.

biometric ప్రధాన సమాచారాన్ని పంచుకోబోం.. ఢిల్లీ హైకోర్ట్‌కి UIDAI స్పష్టం

న్యూఢిల్లీ: Aadhar act కింద Biometricకు సంబంధించి తాము సేకరించిన ప్రధాన సమాచారాన్ని ఎవరితోనూ, ఎలాంటి కారణమైనా పంచుకోబోమని UIDAI  (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) Delhi high courtకు తెలిపింది. ఫోరెన్సిక్ అవసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ, ప్రమాణాలు లేదా ప్రక్రియలకు అనుగుణంగా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడం లేదని స్పష్టం చేసింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 2(జే) నిర్వచనం ప్రకారం.. వేలిముద్రలు, కళ్ల ఐరిష్‌తోపాటు చట్టంలో పేర్కొన్న ఇతర అవయవాలను మాత్రమే స్కాన్ చేస్తున్నామని వివరించింది. కీలకమైన ఈ సమాచారాన్ని ఏ కారణంగానూ షేర్ చేయడం పూర్తిగా నిషిద్ధమని ఆధార్ చట్టం చెబుతోందని ప్రస్తావించింది.

2018లో జరిగిన ఓ దొంగతనం, హత్య కేసులో లభ్యమైన బయోమెట్రిక్ డేటాను ఆధార్ డేటా బేస్‌‌తో సరిపోల్చాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని యూఐడీఏఐని ఢిల్లీ హైకోర్ట్‌ ఆదేశించింది. బదులిచ్చిన యూఐడీఏఐ పైన పేర్కొన్న అంశాలను పేర్కొంది. బయోమెట్రిక్ సమాచారం చాలా ముఖ్యమైనది. ఈ ఇన్ఫర్మేషన్‌ను దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోబోమని అఫిడవిట్‌లో పేర్కొంది.

Read more