నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2022-01-23T05:35:04+05:30 IST

గ్రామాల్లో నేరాల నియంత్రణ కోసం పోలీసుల ఆధ్వ ర్యంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ముధోల్‌ సీఐ వినోద్‌ అన్నారు. శనివారం ఉదయం మండలంలోని మన్మధ్‌ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు.

నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌

లోకేశ్వరం, జనవరి 22 : గ్రామాల్లో నేరాల నియంత్రణ కోసం పోలీసుల ఆధ్వ ర్యంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ముధోల్‌ సీఐ వినోద్‌ అన్నారు. శనివారం ఉదయం మండలంలోని మన్మధ్‌ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీఒక్కరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. అలాగే ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొ న్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల కలిగే లాభనష్టాలను ఆయన వివరించారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నా రు. కరోనానేపథ్యంలో ప్రతీఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు తప్పని సరిగా ధరించాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 89 బైకులు, 6 కార్లు, నాలుగు ఆటోలు, 2400 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో లోకేశ్వరం ఎస్సై సాయి కుమార్‌తో పాటు ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు
దస్తూరాబాద్‌, జనవరి 22 : మైనర్లకు తమ వాహనాలను ఇచ్చి ప్రోత్సహించ వద్దు అని వాహన యజమానులను ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబు హెచ్చ రించారు. మండల కేంద్రంలో ఆకస్మికంగా స్థానిక పోలీసుస్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించి, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించి ఎస్సై జ్యోతిమణికి పలు సూచనలు చేశారు. అనంతరం బస్టాండ్‌ ప్రాంతంలో వాహనాలను ఆపి డ్రైవర్ల వద్ద ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనదారులు వెంట లైసెన్స్‌, ఆర్సీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండా లని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ ధరించాలని సూచిం చారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని, పోలీసులకు సహ కరించి సురక్షితంగా ఉండండి అని అన్నారు. రోడ్డు నిబంధనలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని కోరారు. స్టేషన్‌లో రికార్డులను సక్ర మంగా నిర్వహించాలని, కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, వాహనాల తనిఖీలను నిరంతరం కొనసాగించాలని ఎస్సైకి సూచించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు మాన్సింగ్‌, భీంరావు, పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.
కొనసాగుతున్న ప్రత్యేక తనిఖీలు
నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 22 : ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌, ఇన్సూరెన్స్‌ తదితర పత్రాలు సక్రమంగా లేని 15 వాహనాలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం రవాణాశాఖ అధికారికి అప్పగించారు. ట్రాఫిక్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ దేవేందర్‌, ఏఎస్సై వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:35:04+05:30 IST