ఆర్కేపురంలో Corden Search..35 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-27T13:26:34+05:30 IST

నేరాల అదుపునకు కార్డెన్‌ సెర్చ్‌ దోహదపడుతుందని మల్కాజిగిరి జోన్‌ డీసీపీ రక్షితామూర్తి అన్నారు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్కేపురంలో మంగళవారం సా యంత్రం

ఆర్కేపురంలో Corden Search..35 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

హైదరాబాద్/నేరేడ్‌మెట్‌: నేరాల అదుపునకు కార్డెన్‌ సెర్చ్‌ దోహదపడుతుందని మల్కాజిగిరి జోన్‌ డీసీపీ రక్షితామూర్తి అన్నారు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్కేపురంలో మంగళవారం సా యంత్రం పోలీసులు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కట్టడి, ముట్టడి కార్యక్రమంతోపాటు ప్రత్యేక తనిఖీల ద్వారా గంజాయి, మత్తు పదార్థాలను అరికడతామన్నారు. సరైన పత్రాలు లేని ఒక కారు, ఒక ట్రాలీ ఆటో, దాదాపు 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శివకుమార్‌, నేరేడ్‌మెట్‌ సీఐ నరసింహ స్వామి, డీఐ పాండురంగారెడ్డి, నేరేడ్‌మెట్‌, కుషాయిగూడ, జవహర్‌నగర్‌, కీసర, ఎస్‌వోటీ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T13:26:34+05:30 IST