హౌసింగ్‌బోర్డు కాలనీలో పత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు
మహబూబ్‌నగర్, జనవరి17: శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా హౌసింగ్‌బోర్డు కాలనీలో సోమవారం రాత్రి పోలీసులు కార్డెన్‌సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కిషన్ ఆధ్వర్యంలో దాదాపు 100మంది పోలీసులు రెండు గంటలపాటు కాలనీలోని 120 ఇళ్లను తనిఖీ చేశారు. ఇంట్లో నివాసం ఉంటున్న వారి వివ రాలు, వాహనాలు, వాటి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువీక రణపత్రాలు లేని పది ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కాలనీ ప్రజలతో మా ట్లాడారు. పోలీసులు ఉన్నారన్న నమ్మకం ప్రజల్లో కల్పించడం కోసమే ఇలాం టి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.కాలనీలో కొత్తవ్యక్తులు, అసాంఘిక శక్తులు చేరి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇలాంటి తనిఖీ లతో అవి బయటపడతాయన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు కాలనీలో ఉంటే వెంట నే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.