నవంబరు ఆఖర్లో కొర్బెవ్యాక్స్‌!

ABN , First Publish Date - 2021-10-26T08:12:25+05:30 IST

వచ్చే నెల ఆఖరుకు తాము ఉత్పత్తి చేస్తున్న కొర్బెవ్యాక్స్‌ టీకా అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

నవంబరు ఆఖర్లో కొర్బెవ్యాక్స్‌!

బయోలాజికల్‌ ఈ ఎండీ మహిమా దాట్ల

హైదరాబాద్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వచ్చే నెల ఆఖరుకు తాము ఉత్పత్తి చేస్తున్న కొర్బెవ్యాక్స్‌ టీకా అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. ప్రారంభంలోనే పది కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆమె పేర్కొన్నారు. రిస్క్‌ డోసులను పరీక్షల కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ (సీడీఎల్‌)కి పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని.. నవంబరు చివరికి ఇవి పూర్తవుతాయని వివరించారు.  కొవిడ్‌ టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎ్‌ఫసీ)తో రూ.375 కోట్ల రుణ సాయానికి బయోలాజికల్‌ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పత్రాలపై సోమవారం మహిమా దాట్ల, డీఎ్‌ఫసీ సీవోవో మార్చిక్‌ సంతకాలు చేశారు.

Updated Date - 2021-10-26T08:12:25+05:30 IST