బూస్టర్ డోసుగా Corbevax కు అనుమతి

ABN , First Publish Date - 2022-06-05T01:51:07+05:30 IST

యోలాజికల్-ఇ కంపెనీ కార్బెవాక్స్ (Corbevax) టీకా బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌గా..

బూస్టర్ డోసుగా Corbevax కు అనుమతి

న్యూఢిల్లీ: బయోలాజికల్-ఇ కంపెనీ కార్బెవాక్స్ (Corbevax) టీకా బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌గా కార్బెవాక్స్‌ను ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) ఆమోదం తెలిపింది. కోవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న అర్హులైన (18 ఏళ్ల పైబడిన) వారు ఈ బూస్టర్ డోస్ తీసుకోచ్చు. రెండు డోసులు పూర్తి చేసిన ఆరు నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ పొందవచ్చు. బయోలాజికల్-ఇ కంపెనీ ఈ విషయాన్ని శనివారంనాడు ప్రకటించింది.


దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ ఘనత్ కార్బెవాక్స్ దక్కించుకుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ డాట్ల తెలిపారు. డీసీజీఐ ఆమోదం పొందడం, దేశంలో బూస్టర్ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం తమకు లభించడం సంతోషంగా ఉందని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ జర్నీలో మరో మైలురాయిని అధిగమించామని చెప్పారు.

Updated Date - 2022-06-05T01:51:07+05:30 IST