కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T06:27:20+05:30 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

రామలింగేశ్వరనగర్‌, మే 8 : కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్య లు పూర్తిగా విఫలమయ్యాయని ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. శనివారం పటమటలంక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాశీనాథ్‌ మాట్లాడుతూ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వృద్ధులు రెండవ డోస్‌ కోసం తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి కాపలా కాయడానికే కాలం సరిపోతుందని, రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్‌ల విషయంలో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని అన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌లో బెడ్స్‌ చాలా తక్కువ సంఖలో ఉన్నాయని, కరోనా బాధితులు ఆక్సిజన్‌ అందక నరకయాతన అనుభవిస్తున్నారని, జిల్లాలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ, ప్రజారోగ్యం మీద లేదని, ఇంత వరకు ఎవరూ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ని సందర్శించలేదని, కరోనా రోగికి మూడు గంటల్లో బెడ్‌ ఇప్పిస్తానంటున్న ముఖ్యమంత్రి, ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన వచ్చిన పేషెంట్లకు బెడ్స్‌ కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం తూర్పు నగర కార్యదర్శి భోజడ్ల నాగేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు హరినారాయణ, శేఖర్‌, జి.కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T06:27:20+05:30 IST