బెంబేలెత్తిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-19T06:05:50+05:30 IST

కరోనా బెంబేలెత్తిస్తున్నది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు 15 నుంచి 20 కేసుల వరకు గిద్దలూరు నియోజకవర్గంలో నమోదవుతున్నాయి.

బెంబేలెత్తిస్తున్న కరోనా
త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో కంప వేస్తున్న గ్రామస్థులు



భారీగా నమోదవుతున్న కేసులు

రోజుకు 20 పాజిటివ్‌లు

అప్రమత్తత లేకుంటే ప్రమాదమే

ఆంక్షల కఠినతరంతోనే నియంత్రణ

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 18 : కరోనా బెంబేలెత్తిస్తున్నది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు 15 నుంచి 20 కేసుల వరకు గిద్దలూరు నియోజకవర్గంలో నమోదవుతున్నాయి. సె కండ్‌ వేవ్‌లో ఈస్థాయిలో కేసులు నమోదు కా వడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం స్వీయ నియంత్రణ పాటించకపోయినా కరోనా బారినపడడం ఖాయం. ఇప్పటి కే గిద్దలూరు పట్టణంలో ఇద్దరు కరోనా బారినపడి మృతిచెందారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని జా గ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇం టి నుంచి బయటకు అడుగుపెడితే మాస్కు ధరించడం తప్పనిసరి చేసుకోవడంతోపాటు భౌ తికదూరాన్ని పాటిస్తేనే కరోనా కు చిక్కకుండా ఉంటారు. ప్ర జలు ఎవరికి వారు బాధ్యతగా మెగాల్సిన అవసరం ఉంది. అధికారులు కరోనా కట్టిడి విషయం లో ఎప్పటికప్పుడు అప్రమత్తత  పనిచేయాల్సి ఉంది. పోలీసుశా ఖ ఈవిషయంలో ఆంక్షలను  మరింత కఠినతరం చేయాల్సి ఉంది. రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, టీ దుకాణాలు, సినిమా హాళ్లు, హోటళ్లు,  బస్టాండ్‌, రైల్వేస్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 

14 కేసులు నమోదు

ఆదివారం గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. గిద్దలూరులో 2, కంభంలో 8, బేస్తవారేటలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మాస్కు లేనిదే బయటకు రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.

కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో ముళ్లకంప

8 జోరుగా పారిశుధ్య పనులు 

త్రిపురాంతకం, ఏప్రిల్‌ 18 : ఆ గ్రామానికి ఇతరులు ఎవరూ రాకుండా, గ్రామస్థులు బయటకు వెళ్లకుండా ముళ్లకంపను రోడ్డుపై  వేశారు. మండలంలోని రాజుపాలెంలో  కొవిడ్‌ కారణంగా ఏర్పాటు  కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు. దీంతో ఆ గ్రామానికి ఎవరూ రాకుండా రోడ్లపై ముళ్లకంపను ఏర్పాటు చేశారు.  ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. పాతఅన్నసముద్రం, కొత్తఅన్నసముద్రం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఏడుకొండలు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు.  కొవిడ్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలలో సర్పంచులు పద్మజ, వెంకటరమణ, ఏఎన్‌ఎం వాసవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-19T06:05:50+05:30 IST