కార్పొరేట్‌ వైద్యం మిథ్యేనా..?

ABN , First Publish Date - 2022-05-17T06:54:45+05:30 IST

అధికారంలోకి వచ్చి న వెంటనే రూ.1000 బిల్లు దాటిన ఏ చికిత్స అయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువ స్తాం. పేదలకు అన్ని విధాలా అండగా ఉంటాం.. అని ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చి ప్రగల్భాలు పలికారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీ మాత్రం నెరవేరడంలేదు.

కార్పొరేట్‌ వైద్యం మిథ్యేనా..?

  • ప్రైవేట్‌ ఆస్పత్రులకు పేరుకుపోయిన బకాయిలు
  • పేదలకు అందని ఆరోగ్యశ్రీ సేవలు
  • 3నెలలుగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం
  • నిర్వహణ తమ వల్ల కాదంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు

భానుగుడి(కాకినాడ), మే 16: అధికారంలోకి వచ్చి న వెంటనే రూ.1000 బిల్లు దాటిన ఏ చికిత్స అయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువ స్తాం. పేదలకు అన్ని విధాలా అండగా ఉంటాం.. అని ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చి ప్రగల్భాలు పలికారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీ మాత్రం నెరవేరడంలేదు. మూడు నెలలుగా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా బిల్లులు చెల్లించలేదు. దీంతో జిల్లాలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం అందడంలేదు. ఈ నేపథ్యంలో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు.

జిల్లాలో 85 ప్రైవేట్‌ ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నారు. పీహెచ్‌సీలు 36, సీహెచ్‌సీలు 10, కాకినాడ జీజీహెచ్‌ 1, ప్రభుత్వాస్పత్రులు ఉండగా మిగి లినవి ప్రైవేట్‌ ఆస్పత్రులే. ఇందులో పేద, మధ్య తరగతి వారికి ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. జిల్లాలో పేరుకు పోయిన బిల్లులు కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నా యి. జిల్లాలో ఒక పేషెంట్‌ చేరిన తర్వాత అతడి పేరు, వివ రాలతోపాటు మిగిలిన వివరాలను ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆన్‌లైన్‌ చేయడం వరకే వీరి పని కాగా మిగిలినది అంతా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా విజయవాడ కేంద్రంగానే బిల్లులు చెల్లింపులు జరుగుతాయి. ఏ ఆస్పత్రికి ఎంత సొమ్ము బకాయిలు పడ్డాయో జిల్లా అధికారులకు కూడా సమాచారం లేకపోవడం విడ్డూరం. జిల్లాలో రూ.20కోట్లు పైనే బిల్లులు చెల్లింపులు జరగాలని కొందరు చెబుతుంటే మరికొందరు ఇంకాపై మాటేనని ఈ నిధులు ఎప్పుడు చెల్లిస్తారు. అసలు ఇచ్చే పరిస్థితి ఉందా అని ఆరోగ్యశ్రీ సిబ్బంది వద్ద సమా ధానం లేదు. దీంతో ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్న జిల్లా నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నీ వైద్యం చేయలేక చేతులు ఎత్తివేశాయి. ఎమర్జెన్సీ చికిత్స కూడా కొన్ని ఆస్పత్రులు వైద్యం చేసేం దుకు నిరాకరించడంతో పలు వురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా 1054 రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించగా ఇప్పుడు వాటిని 2,446కు పెంచారు. అందుకు అనుగుణంగా ప్యాకేజీలు పెంచలేదు సరికదా నిబంధనలు ప్రకారం సమీక్షలు కూడా చేపట్టలేదు. 

వైద్యం పేదలకు అందించే విషయంలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ కూడా ఆస్పత్రులకు పేదలను ఇబ్బంది పెట్టవద్దని గట్టిగా చెప్పలేకపోతోంది. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యా జమాన్యాలు బహిరంగంగానే ఆరోగ్యశ్రీ సేవలు ద్వారా వైద్యం చేయలేమంటున్నారు. నిలిచిన బిల్లులతో ఆస్పత్రులను ఎలా నిర్వహించాలో చెప్పాలని, బిల్లులు వస్తేనే సిబ్బంది జీతాలు ఇచ్చేదని, మూడునెలలుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిఒక్కరూ ఇబ్బంది పడుతున్నామని పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదవారికి కార్పొరేట్‌ వైద్యం దూరం కావడంతో ప్రభుత్వాస్పత్రే దిక్కుగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బిల్లులు చెల్లింపునకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశామని చెప్పారే కానీ గ్రీన్‌ ఛానల్‌లో ఇప్పటివరకు చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని, దీనివల్ల ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఇదే తరహా నిర్లక్ష్యం వహిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-17T06:54:45+05:30 IST