భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులు

ABN , First Publish Date - 2022-01-15T05:53:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయభవన్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులు
ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

అనంతపురం విద్య, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయభవన్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రతులను  భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను వెల్లడించాలనీ, 27 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. సీపీఎ్‌సను రద్దు చేయాలనీ, పాత హెచఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలన్నారు. సచివాలయ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, ప్రధానకార్యదర్శి సాలెవేముల బాబు, నాయకులు నాగేంద్ర, రమణారెడ్డి, సిరాజుద్దీన్‌, రవీంద్ర, ఓబులేసు, పెద్దన్న, గోపాల్‌రెడ్డి, అన్నం సుధాకర్‌, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-15T05:53:45+05:30 IST