వివాహితను ఒంటరిగా ఇంటికి రమ్మన్న పోలీసు ఇన్‌స్పెక్టరు సస్పెన్షన్

ABN , First Publish Date - 2020-11-10T13:19:23+05:30 IST

ఓ వివాహితను ఒంటరిగా తన ఇంటికి రమ్మని పిలిచిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టరును సస్పెండ్ చేస్తూ...

వివాహితను ఒంటరిగా ఇంటికి రమ్మన్న పోలీసు ఇన్‌స్పెక్టరు సస్పెన్షన్

జోద్‌పూర్ (రాజస్థాన్): ఓ వివాహితను ఒంటరిగా తన ఇంటికి రమ్మని పిలిచిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టరును సస్పెండ్ చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లా సీనియర్ పోలీసుఅధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జశ్వంతపుర పట్ణణంలో ఓ వివాహిత తన పిల్లలతో కలిసి మార్కెటులో కూరగాయలు కొంటుండగా పోలీసు ఇన్‌స్పెక్టరు సాబీర్ ముహమ్మద్ ఫోన్ చేసి తన గదికి ఒంటరిగా రమ్మని కోరాడు. మహిళ కడుతున్న ఇంటికి తాను ఇసుకలారీ పంపించానని, అది చేరిందా అని పోలీసు ఇన్‌స్పెక్టరు వివాహితను ప్రశ్నించాడు.


మధ్యాహ్నం కాని సాయంత్రం కాని ఐదు నిమిషాల కోసం తన గదికి ఒంటరిగా రావాలని పోలీసు ఇన్‌స్పెక్టరు వివాహితను ఫోనులో కోరాడు. దానికి వివాహిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఇన్‌స్పెక్టరు సాబీర్ ముహమ్మద్ సస్పెండ్ చేసి, శాఖ పరమైన దర్యాప్తునకు ఆదేశించామని సీనియర్ పోలీసు అధికారి శ్యాంసింగ్ చెప్పారు. 

Updated Date - 2020-11-10T13:19:23+05:30 IST