‘రాజకీయ లబ్ధి కోసమే పాకులాట’

ABN , First Publish Date - 2020-04-03T11:07:11+05:30 IST

అధికారం చేపట్టిన నుంచీ ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ లబ్ధి కోస మే పాకులాడుతూ.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్‌ విమర్శించారు.

‘రాజకీయ లబ్ధి కోసమే పాకులాట’

బలగ, ఏప్రిల్‌ 2 : అధికారం చేపట్టిన నుంచీ  ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ లబ్ధి కోస మే పాకులాడుతూ.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్‌ విమర్శించారు. ఈమేరకు గురువారం టీ డీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కరో నా వైరస్‌ కారణంగా ఎన్నికలు కమిషన్‌ నిమ్మ గడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేస్తే వైసీపీ నాయకులు ఆయన్ని అనరాని మాటలతో దుయ్యబట్టారన్నారు.  రాష్ట్రంలోనే కరోనా లేదం టూ.. కమ్మ వైరస్‌  ఉందని  సీఎంతో పాటు మంత్రులు వ్యాఖ్యానించడం  సిగ్గుచేటు  అన్నా రు.  మార్చి 15 నుంచి 31 నాటికి రాష్ట్రంలో సుమారు 62 కరోనా కేసులు నమోదైతే.. ఈ మూడు రోజుల్లో 132 కరోనా పాజిటివ్‌ కేసులు  ఉన్నట్టు  వైద్యులు తేల్చారని వివరించారు. 


అం టే.. 14 రోజుల క్రితమే వారికి కరోనా వైరస్‌ సోకిందని రుజువైందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదన్న సీఎం.. దీనికి  సమాధానం  చె ప్పాలన్నారు. జిల్లాకేంద్రంలోని సర్వజనాస్పత్రిలో కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన  వైద్యులు, వైద్యసిబ్బందికి మాస్కులు, గ్లవ్స్‌, శానిటైజర్లు అందించలేదని  దుస్థితి ఉందన్నారు.  గత మార్చి నెలలోనే రాష్ట్రానికి 31 వేల కోట్లు ఆదాయం వస్తుందని ఓట్‌ఆన్‌ అకౌంట్‌లో చె ప్పారన్నారు. అయితే మార్చి నెలాఖరులో మా కున్న సమాచారం ప్రకారం  రూ.6వేల కోట్లు రా ష్ట్రానికి ఆదాయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌టీ మార్చిలో 9 శాతం తగ్గినా... గతేడాది రూ.2,518 కోట్లు జీఎస్‌టీ వల్ల ఆదాయం వ చ్చిందని అన్నారు. ఈ సంవత్సరం కూడా వారం రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ  రూ.2,600 కోట్లు జీఎస్‌టీ రాష్ట్రానికి వసూలు అయ్యింద న్నారు.  ఈనేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగులకు 50 శాతం వేతనాలు ఇస్తామనడం చూస్తుంటే... రా ష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏమైందని ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ, బాధితుల కోసం కేవలం రూ.40 కోట్ల  మాత్రమే విడుదల చేసిందన్నారు.  అయితే.. జిల్లాలోని  ఏ ఆసుపత్రిలోనూ  ప్రొటెక్టివ్‌ మెటీరియల్‌ సప్లయ్‌ చేయలేదని ఆయన  విమర్శించారు.

Updated Date - 2020-04-03T11:07:11+05:30 IST