కూలి పనికి వెళ్లి... విగతజీవిగా మారి

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

కూలి పనికి వెళ్లిన యువకుడు వరి నూర్పిడి యంత్రం నుంచి ప్రమాదవశాత్తు పడి మృత్యవాత పడిన ఘటన పెద్దపుర్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

కూలి పనికి వెళ్లి... విగతజీవిగా మారి
అప్పలనాయుడు(ఫైల్‌):


 నూర్పు యంత్రం  బోల్తాపడి యువకుడి మృతి

రేగిడి, మార్చి3: కూలి పనికి వెళ్లిన  యువకుడు  వరి నూర్పిడి యంత్రం నుంచి  ప్రమాదవశాత్తు పడి మృత్యవాత పడిన ఘటన పెద్దపుర్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.  ఈ ఘటనకు సంబంధిం చి స్థానికులు అందించిన వివరాలు  ఇలా ఉన్నాయి. చిన్నపుర్లి గ్రామానికి చెందిన గొర్లి అప్పలనాయుడు (36) సమీప గ్రామమైన పెద్దపుర్లిలో బుధవారం ఉదయం ఒక రైతు వరి నూర్పుకు వెళ్లాడు. ఒక కుప్ప నూర్చిన అనంతరం రెండో కుప్ప నూర్చేందుకు వేరే పొలంలోకి యంత్రం తీసుకువెళ్తుండగా యంత్రం ఫల్టీ కొట్టింది.దీంతో నూర్పిడి యంత్రంపై కూర్చున్న  అప్పలనాయుడు కిందకు తుళ్లి యంత్రం కింద చిక్కుకు న్నాడు. స్థానికులు అప్రమత్తమై యువకుడిన బయటకు తీసేందుకు యత్నించినా వీలుకాలేదు. ఘటనా స్థలంలోనే అప్పలనాయుడు తుదిశ్వాస విడిచాడు.మృతుడికి తండ్రి చొన్నోడు, తల్లి పోలిపల్లిమ్మ, సోదరుడు నారాయణరావు ఉన్నారు.చిన్నపాటి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తూ గ్రామంలో జీవనం సాగిస్తున్న తమ కుమారు డు తొలిసారి కూలి పనికి వెళ్లి.. ఇలా మృత్యువాత పడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.   ఈ ఘటనపై తమకు సమాచారం లేదని ఎస్‌ఐ షేక్‌ అహమ్మద్‌ ఆలీ  తెలిపారు.


 

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST