కూలీలు పన్ను కడుతున్నారట!

ABN , First Publish Date - 2021-12-09T05:56:12+05:30 IST

నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వెంకటలక్ష్మి ఇనకం ట్యాక్స్‌ కడుతోందట... దీన్ని అడ్డు పెట్టుకుని ఆ వృద్ధురాలికి రెండేళ్లుగా పింఛన నిలిపివేశారు.

కూలీలు పన్ను కడుతున్నారట!

నడవలేని వృద్ధురాలికి 

రెండేళ్లుగా పింఛన నిలిపివేత

విడపనకల్లు, డిసెంబరు 8: నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వెంకటలక్ష్మి ఇనకం ట్యాక్స్‌ కడుతోందట... దీన్ని అడ్డు పెట్టుకుని ఆ వృద్ధురాలికి రెండేళ్లుగా పింఛన నిలిపివేశారు. ఈమె పేరున ఒక్క సెంటు భూమి కూడా లేదు. రేషన కార్డు కూడా వేరేగా ఉంది. మంచం మీద నుంచి లేవలేని ఆ వృద్ధురాలికి ఇనకం ట్యాక్స్‌ పేరుతో పింఛన నిలిపివేశారు. ఈ వృద్ధురాలి దీనస్థితిని చూసిన వారు అయ్యో అనక మా నరు. మండలంలోని 67వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో డొనేకల్లు గ్రామంతో పాటు కడదరబెంచి, గడేకల్లు, అంచనహాలులో జా తీయ రహదారి విస్తరణ పనుల్లో దాదాపుగా 245 మంది ఇళ్లను, ఇం టి స్థలాలను కోల్పోయారు. దీంతో వారి ఇంటి స్వభావాన్ని బట్టి ప్రభు త్వం నష్టపరిహారం ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.8 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ పరిహారాన్ని మంజూరు చేసింది. వీరిలో 61 మందికి ఇ నకం ట్యాక్స్‌ను కటింగ్‌ పోనూ మిగిలిన మొత్తాలను వారివారి ఖాతాలకు జమ చేశారు. ఆదాయపు పన్ను కట్టినట్లు వారి ఇళ్లకు పత్రాలు పంపించారు. ఇక్కడే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇనకం ట్యాక్స్‌ పట్టుకోవటం వల్ల 25 కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. వీరి కుటుంబంలోని ఏ ఒక్కరికి పింఛన, అమ్మఒడి, రైతు భరోసా, రేషన కార్డు, ఇలా ప్రతిది వీరికి వర్తించకుండా పో యింది. ఈ కుటుంబాలవారిది కూలి పనులకు వెళితేగానీ పూట గడవని దుస్థితి.

ఎర్రిస్వామి ఇంటిని రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్లను కోల్పోయి రూ. 15 లక్షలు వచ్చిన నష్ట పరిహారంతో కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. కొడు కు వికలాంగుడు, తల్లి వృద్ధురాలు వెంకటలక్ష్మి (80) ఉంది. మంచంలో నుంచి కిందకు దిగి లేని పరిస్థితి. వీరికి ఇద్దరికి పింఛన తొలగించారు.


కే నెట్టెప్ప తన ఇంటిని కోల్పోతే నష్ట పరిహారం కింద రూ. 8 లక్షలు వచ్చింది. స్థలం కొనుగోలు చేసుకుని కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ముగ్గురు పిల్లలు వివిధ పాఠశాలలో చదువుకుంటున్నారు, వారికి అమ్మఒడి రాలేదు.. రేషన కార్డు రాలేదు. వారికి  ప్రభుత్వ పథకం ఏ ఒక్కటీ అందటంలేదు. 


కే చిన్న హనుమంతు ఇంటిని కోల్పోవటంతో రూ. 14 లక్షల నష్ట పరిహారం వచ్చింది. దీంతో కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రేషన కార్డు, పింఛన, రైతు భరోసా రాలేదు. 


  ఇలా అనేక మంది ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పూనం మాల కొండయ్యను, స్టేట్‌ అగ్రికల్చర్‌ కమిషనర్‌ అనంత కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు తాము ఇనకం ట్యాక్స్‌తో ఇబ్బంది పడుతున్న సమస్యను వారి దృష్టికి  తీసుకువెళ్లినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు.


పథకాలు దూరం చేశారు 

రోడ్డు విస్తరణ పనుల్లో ఇంటిని కోల్పోతే నష్ట పరిహారం ఇచ్చి, ఇనకం ట్యాక్స్‌ పట్టుకొని మాకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారు. 2.50 ఎకరాలు పొలం ఉంది. కూలి పనులకు వెళ్లి జీవించే మాకు రేషనకార్డు కూడా లేకుండా పోయింది. పింఛనూ రావటంలేదు.

కే చిన్న హనుమంతు, డొనేకల్లు


పింఛన తొలగించారు 

నాకు ఎనిమిది ఎకరాలు పొలముంది. నా రేషన కార్డు వేరేగా ఉంది. మా అమ్మకు రేషన కార్డు వేరేగా ఉంది. కానీ నాపేరు మీద ఉన్న ఇంటికి నష్ట పరిహారం వచ్చినందు వల్ల ఆదాయపు పన్ను పట్టుకున్నారు. మంచాన ఉన్న మా అమ్మ పింఛనను, వికలాంగుడైన నా కొడుకు పింఛనను తొలగించారు. ఎవరి వద్దకు వెళ్లినా న్యాయం జరగటం లేదు.                                               

ఎర్రిస్వామి, డొనేకల్లు


ప్రభుత్వమే ఆదుకోవాలి

నాకు రూ.8 లక్షల నష్ట పరిహారం వచ్చింది. ఇనకం ట్యాక్స్‌ పట్టుకోవటంతో నాకు రేషనకార్డు, రై తు భరోసా, ముగ్గురు పిల్లలకు అమ్మఒడి.. ఇతర ప్రభుత్వ పథకాలు ఏవీ రావటంలేదు. నాకు కేవ లం 2.5 ఎకరాలు పొలముంది భర్యాభర్తలు ఇద్దరమూ కూలిపనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటున్నాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

కే నెట్టెప్ప, డొనేకల్లు

Updated Date - 2021-12-09T05:56:12+05:30 IST