Jul 23 2021 @ 05:03AM

కూల్‌ ఎంటర్‌టైనర్‌!

‘డర్టీ హరి’ చిత్రంతో గత ఏడాది  దర్శకుడిగా కూడా హిట్‌ సాధించారు ఎమ్మెస్‌ రాజు. తాజాగా ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమంత్‌ అశ్విన్‌, మెహర్‌ చావల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో రోహన్‌, క్రితికా శెట్టి మరో జంటగా నటిస్తున్నారు. చిత్ర నిర్మాతలు సుమంత్‌  అశ్విన్‌, రజనీకాంత్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జూన్‌ 21న షూటింగ్‌ ప్రారంభించి నాన్‌స్టా్‌పగా 22 రోజులు వర్క్‌ చేశాం. ఈ నెల 28 నుంచి 20 రోజుల పాటు బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో షూటింగ్‌ చేస్తాం. సహజత్వానికి దగ్గరగా ఉండే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. గిలిగింతలు పెట్టే కథాంశంతో రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. దర్శకుడు ఎమ్మెస్‌ రాజు మాట్లాడుతూ ‘ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరినీ వినోద పరిచేవిధంగా చక్కని జాలీ ట్రిప్‌లా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్‌ ఎవరు అని కాకుండా మన కళ్ల ముందుండే సజీవ పాత్రల్లా ఉంటాయి. కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, విజువల్స్‌, మ్యూజిక్‌ ఈ చిత్రాన్ని డామినేట్‌ చేస్తాయి. ఇప్పటికి 60 శాతం చిత్రం  పూర్తయింది’ అని చెప్పారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము.