వండేవారు-వడ్డించేవారు

ABN , First Publish Date - 2021-07-31T05:56:34+05:30 IST

ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని వండే వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? వడ్డించే వారు ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

వండేవారు-వడ్డించేవారు

ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని వండే వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? వడ్డించే వారు ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు తెలుసుకుందాం...‘వంటమనిషి’ అంటూ తేలికగా చూడకూడదు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారే వంటచేయటానికి అర్హులవుతారు. తినేవాడు (gentleman) అయితే, వండేవాడు అంతకన్నా పైస్థాయి పెద్దమనిషి! 


సూదకుడు = పాకకళా నిపుణుడు (chef). సూదకాధ్యక్షుడు = సూదకులపై అధికారి (superindient of kitchen), వండటాన్ని సూదనకర్మ = వండటం(cooking). సూదశాల = వంటిలు (kitchen) సూదశాస్త్రం =  పాకశాస్త్రం(culinary science ) . సూదద్రవ్యాలు = వంటకు కావలసిన సరుకులు, సరంజామా (COOKING ESSIKENTIAL). ఛిజ్ఛిజ అనే పదానికి తెలుగులో అడబాల అనే అందమైన పేరుంది. స్ర్తీ పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుంది. degnity of labour ని దృష్టిలో పెట్టుకుని వంటాయన్ని అడబాలగారు అని పిలిస్తే  సంస్కారవంతంగా ఉంటుంది. సూదకుడికి (chef) 22 గుణాలను పేర్కొన్నాడు. ఈ గుణాలలో ఏది తక్కువైనా అతని వంట ప్రమాదకరమే! రాజ భోజనాన్ని వండేవారి లక్షణాలుగా చెప్పినప్పటికీ వంటచేసే అడబాల లందరికీ ఇవి వర్తిస్తాయి. ఇలాంటి వాళ్లనే వంటకు రానివ్వాలి!


వండేవారి గుణాలు 3

1. స్వదేశ సంభవః: సూదకుడు స్వదేశీయుడు, విదేశీ వ్యామోహం లేనివాడుగా ఉండాలి. 

2. ప్రాజ్ఞ: పాకశాస్ర్తాన్ని బాగా చదువుకున్నవాడై ఉండాలి

3. దేశకాలజ్ఞో: ఏ దేశీయులకు ఆ దేశ కాలాలకు సరిపడే ఆహారాన్ని వండటం తెలిసినవాడు.

4. ధాతుజ్ఞో: రసరక్తాది సప్తధాతువుల పరిజ్ఞానం ఉండాలి. ఇది రక్తవృద్థిని, ఇది మాంసవృద్థి కలిగిస్తాయనే ఎరుక కలిగి ఉండాలి.  

5. వయో?వస్థాదివిదుః: ఏ వయసు వారికి ఏది పెట్టాలి-ఏది పెట్టకూడదు లాంటి విషయ పరిజ్ఞానం ఉండాలి.

6. సర్వలక్షణ లక్షితః: అన్నీ మంచి లక్షణాలతో శోభించే వాడు.

7. సదాచారసమాయుక్తః: సదాచారాలు పాటించేవాడు

8. విశిష్టకులసంభవః: మంచి కుటుంబంలో జన్మించినవాడు. 

9. శాంతః: శాంతస్వభావి అయితేనే వంట వర్థిల్లుతుంది. ముక్కోపి ముఖం మాడ్చుకుని వండితే వంట కూడా మాడినట్టే ఉంటుంది.

10. స్మితః: నవ్వుతూ మాట్లాడేవాడు

11. మితభాషీ: పరిమితంగా మాట్లాడేవాడు

12. దాంతః: నిగ్రహశక్తి కలవాడు, ఇంద్రియలోలత్వం లేనివాడు, ఆధారపడదగినవాడు.

13. స్వదారనిరతః: ఏకపత్నీవ్రతుడు  

14. పరదారవివర్జితః: పరాయి స్ర్తీలతో సంబంధాలు లేనివాడు 

15. రాజపూజ్యో: రౌడీషీటరు. అసాంఘిక శక్తి లాంటి వాళ్లు కాకుండా చట్టం గౌరవించేవాడుగా ఉండాలి. 

16. శుచి: పవితృడై ఉండాలి. వంటచేేసవ్యక్తి వంటిల్లే దేవాలయంగా భావించుకోగలిగితేనే ఆహారభద్రత. 

17. శుద్థః: స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలి. ఒకచేత్తో బీడీ కాలుస్తూ ఇంకో చేత్తో గరిట తిప్పేవాణ్ణి వంటకు రానివ్వకూడదు. 

18. దానశీలః: దాతృత్వం సహజగుణంగా ఉన్నవాడు   

19. సదా దాత: దయార్ద్రహృదయుడు, ఆహారాన్ని దుబారాచేయనివాడు 

20. దయాళు: దయార్ద్రహృదయం కలిగినవాడు

21. సుభాషితః: మంచి విషయాలు (positive గా) మాత్రమే మాట్లాడేవాడు. 

22. బుధః: తెలివైనవాడు.


ఇలా పాకశాస్త్ర ప్రవీణుడికి 22 గుణాలను నలుడు పేర్కొన్నాడు. వంట చేయటం వేస్త చాలదు, మంచి వ్యక్తిత్వం కూడా అవసరం. పాకశాస్ర్తాన్ని బోధించే కళాశాలల్లో పాక నిపుణుడికి ఉన్నత వ్యక్తిత్వం ఉండాలని, chef వృత్తికి conduct అనేది ముఖ్యం అని తెలియజెప్పాలి. మనిషికి ప్రాణాన్నిచ్చేది అన్నం. సర్వలక్షణ  సమన్వితులు వండినప్పుడు ఆ భోజనం అమృతం అవుతుంది.


వడ్డించేవారి కర్తవ్యాలు 

వంటచేయటం ఎంత గొప్ప కళో, వడ్డించటమూ అంతే గొప్పది! వడ్డించే వ్యక్తి తినేవారి కళ్లముందు ఉంటాడు. వంటలో ఏ చిన్న తేడా వచ్చినా ఎదురుగా కనిపించేది వడ్డించేవాడే! చిరునవ్వు చెదరకుండా, ఏది అడుగుతారో దాన్ని వడ్డిద్దాం అని ఎదురు చూస్తూంటాడు. అందుకని ఆంగ్లేయులు వడ్డించేవారిని waiters or waitresses అన్నారు. భోజనం చేస్తున్న వ్యక్తి ఏది తింటున్నాడో గమనించి, దాన్ని కొసరి వడ్డిస్తూ, వారు ఆనందంగా భోజనం చేేసలా చూడటం, ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే సరి చేయటం వీరి బాధ్యత. నలుడు వీరిని ‘పరివేషకులు’ అని పిలిచాడు. పరివేశః లేదా పరివేషః అంటే weating at meals అనే! భోక్తని పరివేష్టించి ఉండి సంతుష్టిగా వడ్డించటం ఈ పరివేషకుని విధి అని భావం.  

పరివేషకులకు (waiters) వ్యక్తిగత శుభ్రత ముఖ్యం. కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు చేశాక మంచి బట్టలు కట్టుకుని సంతోషంగా, సంతృప్తిగా, నిష్టాత్ముడిగా, స్థిరచిత్తుడై వడ్దన మీదే మనసు లగ్నం చేేసవాడుగా ఉండాలి. తినేవారి భోజన సమయానికి అన్నీ సిద్థం చెయ్యాలి. ఎవరు వేటిని ఎక్కువ ఇష్టపడతారో వాటిని క్రమపద్థతిలో కంటికింపుగా వడ్దించాలి. ఈ క్రమపద్థతినే ‘పరివేశనక్రమం’ అంటారు. ఇది రాజుల కోసమే కాదు, ప్రజలందరి కోసమూ వ్రాసిన గ్రంథం. అందుకే రాజభోజనాన్ని ఉదాహరణగా చెప్తూ కుటుంబీకులందరూ ఈ విధానాన్ని అనుసరించాలని ఉద్దేశించాడు నలుడు. సూదక పరివేషకుల (chef and waiters) ఔన్నత్యాన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి నలుడే!

Updated Date - 2021-07-31T05:56:34+05:30 IST