రైలు ప్రయాణికులకు Cooked Meals Set To Be Served

ABN , First Publish Date - 2021-11-20T16:37:25+05:30 IST

రైళ్లలో ప్రయాణికులకు ఇకపై వేడి వేడి భోజనాన్ని మళ్లీ అందించాలని రైల్వే బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది...

రైలు ప్రయాణికులకు Cooked Meals Set To Be Served

రైల్వే బోర్డు తాజా ఉత్తర్వులు 

న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణికులకు ఇకపై వేడి వేడి భోజనాన్ని మళ్లీ అందించాలని రైల్వే బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా వైరస్ మహమ్మారి వల్ల రైళ్లలో ప్యాంట్రీకార్లను ఎత్తివేశారు. ప్రస్థుతం కరోనా తగ్గడంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఉపశమనంగా రైళ్లలోని ప్యాంట్రీకార్లలో వండి వేడి వేడి భోజనాన్ని అందించడానికి రైల్వేలు సిద్ధంగా ఉన్నాయి.రైలు ప్యాంట్రీకార్ల సర్వీసును పునరుద్ధరించాలని రైల్వే బోర్డు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు రాసిన లేఖలో కోరింది.రైలు ప్రయాణికులకు రెడీ టు ఈట్ భోజనాన్ని అందజేయడం కొనసాగుతుందని తెలిపింది.


రైళ్లలో ప్రయాణికులకు ఆహారాన్ని అందించడానికి లైసెన్స్‌దారుల ఎంపిక కోసం కొత్త టెండర్లు జారీ చేసే పని ఇప్పటికే ప్రారంభమైందని రైల్వేబోర్డు వర్గాలు తెలిపాయి.ప్రయాణికుల మెనూలో ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రైళ్లలో రోజుకు 11 లక్షలమంది భోజనం చేసేవారు. కరోనా వల్ల నిలిపివేసిన బెడ్ రోల్స్ సర్వీసును కూడా పునరుద్ధరించాలని రైల్వేబోర్డు యోచిస్తోంది.


కరోనా తగ్గడంతో శీతాకాలంలో ప్రయాణికులకు దుప్పట్లు, పిల్లోలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని దేశీయ విమానాల్లో భోజనం అందించడానికి విమానయాన సంస్థలను అనుమతించింది. దీని తర్వాత రైళ్లలోనూ వండిన వేడివేడి ఆహారాన్ని అందించడాన్ని తిరిగి ప్రారంభించాలని రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-11-20T16:37:25+05:30 IST