నా భర్త సంపాదన చాలడం లేదు.. అందుకే నేను పాడు పనిచేశా.. తేల్చిచెప్పిన భార్య.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-16T10:57:27+05:30 IST

పంజాబ్‌లోని ఫతెహ్‌గఢ్ సాహిబ్ నగరంలో ఒక గర్భవతియైన మహిళ తన తమ్ముడు(17), అయిదేళ్ల కొడుకుతో ఒక బంగారు నగల షాపుకి వెళ్లింది. తనకు బంగారు గొలుసు కావాలని, కొన్ని మోడళ్లు చూపాలని చెప్పింది..

నా భర్త సంపాదన చాలడం లేదు.. అందుకే నేను పాడు పనిచేశా.. తేల్చిచెప్పిన భార్య.. అసలేం జరిగిందంటే..

పంజాబ్‌లోని ఫతెహ్‌గఢ్ సాహిబ్ నగరంలో ఒక గర్భవతియైన మహిళ తన తమ్ముడు(17), అయిదేళ్ల కొడుకుతో ఒక బంగారు నగల షాపుకి వెళ్లింది. తనకు బంగారు గొలుసు కావాలని, కొన్ని మోడళ్లు చూపాలని చెప్పింది. ఆ షాపు ఓనర్ రితేశ్.. ఆమెకు కొన్ని బంగారు గొలుసులు చూసిస్తుండగా ఆమె తమ్ముడు రితేశ్‌ని తన కోసం ఒక బంగారు బ్రేస్‌లెట్ చూపించమని అడిగాడు. 


ఆలా ఆ రోజు ఆ గర్భవతి మహిళ, ఆమె తమ్ముడు చాలా మోడళ్లు చూసి తమకు ఏవీ నచ్చలేదని చెప్పి.. కొనకుండగానే తిరిగి వెళ్లిపోయారు. తరువాతి రోజు రితేశ్ తన షాపులో ఉన్న బంగారు గొలుసులు చెక్ చేస్తుండగా నాలుగు తగ్గినట్లు అనిపించాయి. దీంతో తన షాపు సీసీటీవి వీడియో చెక్ చేశాడు. అందులో ముందురోజు వచ్చిన గర్భవతి మహిళకు బంగారు గొలుసులు చూపిస్తుండగా ఆమె కొన్ని గొలుసులు తన బ్యాగ్‌లో వేసుకున్నట్లు కనిపించింది. రితేశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసులు ఆ గర్భవతి మహిళ గురించి గాలించి పట్టుకున్నారు. ఆమెతో పాటు తన 17 ఏళ్ల తమ్ముడిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె ఇలాగే మరికొన్ని షాపులలో చేసిందని తేలింది. ఆమెను కోర్టులో హాజరు పరిచారు. జడ్జిగారు ఆమె గర్భవతి అని చూసి, "ఎందుకు ఈ దొంగతనం చేశావు?" అని అడిగారు.. దానికి ఆమె "నా భర్త కూలీపని చేస్తాడు.. అతని సంపాదన ఏమాత్రం సరిపోదు అందుకని దొంగతనం చేశాను," అని చెప్పింది.


జడ్జిగారు ఆమె గర్భవతి కావడంతో సాధారణ జైలు శిక్ష విధించి, ఆమె తమ్ముడు ఒక మైనర్ కావడంతో అతడిని జువెనైల్ హోంకి(బాలుర కారాగారానికి) పంపించారు.

Updated Date - 2021-10-16T10:57:27+05:30 IST