‘జెస్సికాలాల్‌’ కేసులో దోషి మను శర్మ విడుదల

ABN , First Publish Date - 2020-06-03T08:09:07+05:30 IST

మోడల్‌ జెస్సికాలాల్‌ హత్య కేసులో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న మను శర్మను తిహార్‌ జైలు నుంచి సోమవారం విడుదల చేశా రు. ముందస్తు విడుదలకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం...

‘జెస్సికాలాల్‌’ కేసులో దోషి మను శర్మ విడుదల

న్యూఢిల్లీ, జూన్‌ 2: మోడల్‌ జెస్సికాలాల్‌ హత్య కేసులో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న మను శర్మను తిహార్‌ జైలు నుంచి సోమవారం విడుదల చేశా రు. ముందస్తు విడుదలకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం తెలిపారని జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ తెలిపారు. శర్మ 17 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడని, అతను 23 ఏళ్లు శిక్ష అనుభవించాలని గోయల్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2020-06-03T08:09:07+05:30 IST