Advertisement
Advertisement
Abn logo
Advertisement

పూజాదికాలతో శుద్ధి చేసుకుని, తిరిగి హిందువులైన 19 మంది ముస్లింలు!

షామ్లీ: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో మత మార్పిడుల ఘటన వెలుగుచూసింది. 19 మంది ముస్లింలు శుద్ధీకరణ ప్రక్రియ అనంతరం తిరిగి హిందువులుగా మారారు. ఇందుకు సంబంధించిన పూజాది కార్యక్రమాలను మహంత్ యశ్వీర్ మహరాజ్ నిర్వహించారు. మూడు కుటుంబాలకు చెందిన 19మంది సభ్యులు తిరిగి హిందువులుగా మారారు. 

తమను గతంలో బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు తిరిగి హిందువులుగా మారామని చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం వారిని 12 ఏళ్ల క్రితం ముస్లిం మతంలోకి బలవంతంగా మార్చారు. వీరంతా ఇప్పుడు షామ్లీలోని సూరజ్ కుండ్ ఆలయంలో పూజాదికాల మధ్య హిందువులుగా మారారు. హిందూ ధర్మంలోకి మారిన వీరిచేత గాయత్రీ మంత్రం ఉచ్ఛరింపజేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement