Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాదం రేపిన క్రికెట్‌ దక్షిణాఫ్రికా ట్వీట్‌

జోహన్నె్‌సబర్గ్‌: ఐపీఎల్‌ టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ప్రశంసించే విషయంలో క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎ్‌సఏ) విమర్శలపాలైంది. ధోనీ సేన టైటిల్‌ గెలవగానే.. ‘ఐపీఎల్‌ 2021 విజేత చెన్నై జట్టులో భాగస్వామి అయిన లుంగీ ఎన్‌గిడికి శుభాకాంక్షలు’ అని అతడి ఫొటోతో ట్వీట్‌ చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. వాస్తవానికి ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడి ఫైనల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన డుప్లెసి పేరును ఇందులో ప్రస్తావించలేదు. అలాగే స్పిన్నర్‌ తాహిర్‌ హుస్సేన్‌ను కూడా విస్మరించారు. వీరిద్దరితో బోర్డుకు విభేదాలుండడంతో టీ20 ప్రపంచక్‌పనకు కూడా దూరం పెట్టింది. అసలు ఎన్‌గిడికి చెన్నై తుది జట్టులో చోటే దక్కలేదు. అందుకే ఒళ్లు మండిన డుప్లెసీ ‘నిజంగానా?’ అంటూ సీఎ్‌సఏకు రీట్వీట్‌ చేశాడు. మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ కూడా తమ బోర్డును తప్పుపట్టాడు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి ఆ స్థానంలో ‘ఐపీఎల్‌ విజేత చెన్నై జట్టుకు ఆడిన దక్షిణాఫ్రికా క్రికెటర్లకు శుభాకాంక్షలు. ముఖ్యంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ డుప్లెసి ప్రదర్శన ఆకట్టుకుంది’ అని ట్వీట్‌ చేసింది.

Advertisement
Advertisement