‘నియంత్రిత సాగు అమలయ్యేలా చూడాలి’

ABN , First Publish Date - 2020-05-25T08:58:19+05:30 IST

జిల్లాలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ వ్యవసాయ శాఖ ..

‘నియంత్రిత సాగు అమలయ్యేలా చూడాలి’

నిర్మల్‌, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్‌ సమావేశం మందిరంలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం, క్లస్టర్ల వారిగా అవగాహన సదస్సుల ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, ఏడీలు కోటేశ్వర రావు, వినయ్‌ బాబు, ఏవోలు, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు. 


సోన్‌: వలస కూలీలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని  కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీఅన్నారు. ఆదివారం మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద కూలీలకు ఆహారప్యాకెట్లు, మాస్క్‌లను అందజేశారు.  

Updated Date - 2020-05-25T08:58:19+05:30 IST