వ్యవసాయం లాభసాటికే నియంత్రిత సాగు విధానం

ABN , First Publish Date - 2020-05-23T10:28:41+05:30 IST

రైతుకు వ్యవ సాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర

వ్యవసాయం లాభసాటికే నియంత్రిత సాగు విధానం

పక్కా  ప్రణాళికతోనే పంటలు సాగు చేయాలి   

వానా కాలంలో మొక్కజొన్నను సాగు చేయొద్దు   

కరోనా రహిత జిల్లాగా కామారెడ్డి   

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి


కామారెడ్డి, మే 22 (ఆంధ్రజ్యోతి): రైతుకు వ్యవ సాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖమంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కరోనా రహిత జిల్లాగా నిలిచిందని మంత్రి ప్రకటించారు. జిల్లాలో 99 శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్త య్యాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిర్వహించి మాట్లాడారు.


వ్యవ సాయ శాస్త్రజులు, నిపుణులతో నిరంతరం చర్చలు, నియంత్రిత సాగు వ్యవసాయం ఆర్థిక స్వలంభన చేకూరుతుందనే ఉద్ధేశంతో రైతులను పోత్సహిస్తు న్నామని చెప్పారు. పక్క ప్రణాళికతో ఏ నెలలో ఏ పంట అనేది నిర్ణయించడం జరుగుతుందని తెలిపా రు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చే సి, ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈవో ఉంటారని, రైతుకు ఎల్లవేళలా సరైన సలహాలు, సూచనలు అందిస్తార న్నారు. ప్రతీ క్లస్టర్‌లో నిర్మించే రైతు వేదికకు రూ.20 లక్షల్లో రూ.13లక్షలను ప్రభుత్వం భరిస్తుందని మిగ తా రూ.7లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మంజూరు చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలో వంద క్లస్టర్‌లలో రైతు వేదిక నిర్మాణానికి భూమి సేకరించడం జరి గిందన్నారు.


నియంత్రిత విధానంలో వర్షాకాలంలో మొక్కజొన్న శ్రేయస్కారం కాదని, దానికి బదులు పత్తి, కందులు, ఇతర పంటలు వేసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 85వేల ఎకరాల్లో సాగు జ రుగుతుందన్నారు. గత సంవత్సరం 2లక్షల 10వేల 800 ఎకరాల్లో వరిసాగు చేశారని, ప్రస్తుతం వర్షాకా లంలో 2,12,700 ఎకరాల్లో వరి సాగు అవుతోందన్నా రు. ఈ వర్షాకాలంలో 20వేల ఎకరాల్లో సోయ సాగు కు, 30వేల ఎకరాల్లో కందులకు, 23 వేల ఎకరాల్లో పత్తికి పెంచడం జరిగిందని, పెసర్లకు 5 వేల ఎకరా లు, మినుములకు మూడు వేల ఎకరాలు, ఇతర పంటలకు పెంచామన్నారు. నియంత్రిత వ్యవసాయ  విధానం గురించి క్లస్టర్‌లలో మండల, గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చే యాలని అధికారులకు ఆదేశించారు. కామారెడ్డి జి ల్లా కరోనా రహిత జిల్లాగా నిలవడానికి కృషి చేసిన వైద్య సిబ్బంది, పారిశుధ్య, పోలీసులు, రెవెన్యూ, మీ డియా సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన 2,815 మం దిని గుర్తించి 28 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచ డం జరిగిందన్నారు. కరోనాపై అందరు అప్రమత్తం గా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఇది మన జీవితంలో భాగమైపోతుందని తెలిపారు.


జిల్లాలో వరిధాన్యం కొనుగోల్లు 99శాతం పూర్తియిందన్నారు. 3,02,767 మెట్రిక్‌ టన్నులకు 3,01,100 మెట్రిక్‌ టన్నుల కొను గోలు చేశామన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో మంత్రి కరోనా, వరిధాన్యం కొనుగోళ్లు, రై తు వేదిక నిర్మాణం, నియంత్రిత వ్యవసాయంపై జి ల్లా పరిషత్‌ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వవిప్‌, డీసీ సీబీ చైర్మన్‌ జిల్లా అధికారులతో చర్చించారు. ఈ  స మావేశంలో ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాపేదార్‌శోభ, కలెక్టర్‌ శరత్‌, ఎమ్మె ల్యేలు హన్మంత్‌షిండే, సురేందర్‌, ఉమ్మడి జిల్లాల డీ సీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా ఆర్‌ఎస్‌ ఎస్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, అదనపు కలెక్టర్లు యాది రెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, జిల్లా అడీషనల్‌ ఎస్పీ అనోన్య,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T10:28:41+05:30 IST