కోపాన్ని నియంత్రించుకోండిలా..!

ABN , First Publish Date - 2020-10-21T09:08:39+05:30 IST

కోపం చాలా సమస్యలకు కారణమవుతుంది. అయితే కోపాన్ని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. వారు సూచిస్తున్న సలహాలు ఇవి...

కోపాన్ని నియంత్రించుకోండిలా..!

కోపం చాలా సమస్యలకు కారణమవుతుంది. అయితే కోపాన్ని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. వారు సూచిస్తున్న సలహాలు ఇవి...


  1. ఎవరికి వారు కోపం పెద్దగా సమస్య కాదని అనుకుంటారు. కానీ అదే చాలా సమస్యలకు కారణమవుతుంది. కోపం వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు దూరం కావచ్చు. ఒక్కోసారి ఉద్యోగం కూడా పోవచ్చు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి.
  2. ఏయే సందర్భాల్లో కోపం ఎక్కువగా వస్తోంది? గతంలో ఏయే అంశాలు కోపానికి కారణమయ్యాయి? చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకున్న సందర్భాలున్నాయా? వంటి అంశాలను విశ్లేషించుకుంటే ఫలితం ఉంటుంది. 
  3. కోపం వచ్చే సందర్భం ఎదురైనప్పుడు దృష్టి మరల్చుకోవాలి. కొద్దిసేపు కళ్లు మూసుకొని మనసులో తెల్ల కాగితాన్ని ఊహించుకోవడం చేయాలి. ఇది నరాలపై ప్రభావం చూపించి ఎమోషన్స్‌ను సాధారణ స్థితికి తీసుకువస్తుంది. 
  4. కోపం వస్తున్నప్పుడు గట్టిగా శ్వాసను పీల్చడం, వదలడం చేయాలి. దీనివల్ల మెదడు చురుకుగా మారుతుంది. కోపం తగ్గి ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. 

Updated Date - 2020-10-21T09:08:39+05:30 IST