ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించండి

ABN , First Publish Date - 2021-12-04T05:49:00+05:30 IST

ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించండి

ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించండి

ఆమనగల్లు/షాద్‌నగర్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీలో కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్లాస్టిక్‌ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కూరగాయల మార్కెట్‌, పలు దుకాణాల్లో కమిషనర్‌ తనిఖీలు చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ను నిషేదించనున్నట్లు తెలిపారు.  అదేవిధంగా షాద్‌నగర్‌లో శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కొత్త వేరియంట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు రెటికల్‌ నందీశ్వర్‌, బచ్చలి నర్సింహ, జీటీ శ్రీనివాస్‌, మాధూరి నందకిషోర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:49:00+05:30 IST