అల్లరిని అదుపు చేయండిలా!

ABN , First Publish Date - 2021-02-27T09:01:52+05:30 IST

రెండేళ్ల లోపు పిల్లలు గట్టిగా ఏడ్వడం, బిగ్గరగా అరవడం, అలగడం మామూలే! అని సరిపెట్టుకోకండి. వారు అలా అకారణంగా ప్రవర్తిస్తే, కోపం తెచ్చుకోకుండా అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. పిల్లల ఈ ప్రవర్తన వెనకుండే కారణాలు ఏవంటే...

పిల్లలు అకారణంగా ఏడుస్తూ, గోల చేస్తున్నారంటే అందుకు కారణం ఆకలి వేయడం లేదా నిద్ర సరిపోకపోవడమే! ఎక్కువ సందర్భాల్లో పిల్లల అల్లరికి ఇవే కారణం.

కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే, పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే, పట్టించుకోకుండా ఉండడమే ఉత్తమం. ఇలా చేస్తే, కొద్ది సేపట్లోనే పిల్లలు ఏడుపు ఆపేస్తారు. 

పిల్లలు తమ అసహనాన్ని, కోపాన్ని ఏడుపు, అరుపుల ద్వారా వ్యక్తం చేస్తారు. పెద్దల్లా వాళ్లకు భావోద్వేగాల మీద అదుపు ఉండదు. కాబట్టి వాళ్ల భావాలను వెళ్లగక్కనివ్వాలి. ఆ తర్వాత లాలనగా అసలు కారణం ఆరా తీయాలి.

ఆటలు, ఆహారం మీదకు మనసు మళ్లించడం 

ఉత్తమమైన టెక్నిక్‌. అల్లరి చేసే పిల్లల చేతికి నచ్చిన తినుబండారం ఇవ్వవచ్చు లేదా ఆటవస్తువు అందించవచ్చు. దాంతో పిల్లలు అల్లరి మాని ఆటల్లో పడతారు.

Updated Date - 2021-02-27T09:01:52+05:30 IST