Advertisement
Advertisement
Abn logo
Advertisement

షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండాలంటే...!

ఆంధ్రజ్యోతి(21-09-2020)

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం మధుమేహులకు చాలా అవసరం. షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పననిసరి.


రోజూ క్రమంతప్పకుండా వాకింగ్‌ చేయడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. అన్నింటికన్నా మంచి వ్యాయామం ఇది. ముఖ్యంగా మధుమేహులు వాకింగ్‌ చేయడం అలవాటుగా చేసుకోవాలి.

యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ రాకుండా చూడటంలో యోగా సహాయపడుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ కూడా పెరుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

శరీరంలోని అన్ని అవయవాలపైన ఒత్తిడి పడాలంటే ఈత కొట్టడం ఒక్కటే మార్గం. కొవ్వు కరగడానికి, మంచి వ్యాయామం చేసిన ఫలితాలు పొందడానికి ఈత ఉపయోగపడుతుంది.

ఇంట్లో మ్యూజిక్‌ పెట్టుకుని కాసేపు డ్యాన్స్‌ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డ్యాన్స్‌ వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సైకిల్‌ తొక్కొచ్చు. సైకిల్‌ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. రక్తసరఫరా మెరుగుపడుతుంది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.


Advertisement
Advertisement