సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-23T05:24:37+05:30 IST

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వైద్యాధికారు లు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు.

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల శ్రేణులు

డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు

నెల్లూరు (వైద్యం), అక్టోబరు 22 : సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వైద్యాధికారు లు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు. ఆయా వ్యాధులపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ జరిగింది. గుప్తాపార్కు నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, రమణ, ఐద్వా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మస్తాన్‌బీ, శివకుమారి ప్రసంగించారు. శివారు ప్రాంతాల్లో  డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగుల ను దోచుకుంటున్నా వైద్యాధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నగర శివార్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరా రు. వైరల్‌ జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ వో డాక్టర్‌ రాజ్యలక్ష్మికి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి నరసింహ, నాయకులు ఫయాజ్‌, కృష్ణ, సుబ్బరాయుడు, ఐద్వా నేతలు పద్మ, సుబ్బమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T05:24:37+05:30 IST