సరకు రవాణా పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2020-03-27T06:26:45+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరకుల రవాణా, ఉత్పత్తి, పంపిణీని పర్యవేక్షించడానికి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు..

సరకు రవాణా పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరకుల రవాణా, ఉత్పత్తి, పంపిణీని పర్యవేక్షించడానికి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. క్షేత్రస్థాయిలో తయారీదారులకు, రవాణాదారులకు, పంపిణీదారులకు, హోల్‌సేల్‌ వ్యాపారులకు, ఈ-కామర్స్‌ కంపెనీలకు ఇబ్బంది కలిగితే.. ఈ కంట్రోల్‌ రూమ్‌ను 011 - 23062487 నెంబరుకు ఫోన్‌ చేసి, లేదా ఛిౌుఽ్టటౌజూటౌౌఝఛీఞజీజ్టీఃజౌఠి.జీుఽకు మెయిల్‌ చేయడం ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్‌ నెంబరు పనిచేస్తుందని తెలిపింది. 

Updated Date - 2020-03-27T06:26:45+05:30 IST