మామిడాకులతో మధుమేహం అదుపు

ABN , First Publish Date - 2022-06-14T06:07:54+05:30 IST

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

మామిడాకులతో మధుమేహం అదుపు

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకులకు ఉండే యాంటీమైక్రోబియల్‌ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమంగా ఉంచడానికి తోడ్పడతాయి. పెక్టిన్‌, విటమిన్‌ సి, పీచు ఉండే మామిడాకులు మధుమేహంతో పాటు, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం....- 10 నుంచి 15 మామిడాకులను నీళ్లలో వేసి మెత్తబడేవరకూ ఉడకబెట్టాలి. తర్వాత రాత్రంతా అలాగే వదిలేయాలి.

ఉదయాన్నే ఈ ఆకులను వడగట్టి, పరగడుపున నీళ్లను తాగేయాలి.

తర్వాత ఆకులను  కూడా తినేయాలి.

ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు చేస్తే, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వచ్చేస్తాయి. 

ఇలా ఉడకబెట్టిన మామిడి ఆకుల నీళ్లు తాగడంతో పాటు, పచ్చి ఆకులను కూడా పరగడుపున నమిలి తినవచ్చు.

Updated Date - 2022-06-14T06:07:54+05:30 IST