సాంకేతిక అభివృద్ధికి రాజీవ్‌ కృషి

ABN , First Publish Date - 2022-05-22T05:46:56+05:30 IST

సాంకేతిక అభివృద్ధికి రాజీవ్‌ కృషి

సాంకేతిక అభివృద్ధికి రాజీవ్‌ కృషి
రాజీవ్‌గాంధీ ఫొటోకు నివాళులర్పిస్తున్న డీసీసీ చీఫ్‌ రామ్మోహన్‌రెడ్డి తదితరులు

పరిగి/తాండూరు/నవాబుపేట, మే 21: భారతదేశంలో శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధికి పాటుపడిన నేత, సాంకేతి విజ్ఞానాన్ని పాదుకొల్పిన నాయకుడు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంఽధీ అని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతి సంద ర్భంగా శనివారం పరిగిలో రామ్మోహన్‌రెడ్డి తన నివాసం లో రాజీవ్‌ ఫొటోకు నివాళి అర్పించి మాట్లాడారు. తమిళ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చడం, ఆయన లేకపోవడం దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పటికీ తీరని లోటే అన్నారు. ప్రధాన మంత్రిగా దేశాభివృద్ధికి కొత్త ఒరవడిని సృష్టించి, పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్‌కే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, అంజనేయులు, నర్సింహులు, శివకుమార్‌ పాల్గొన్నారు. రాజీవ్‌గాంధీకి తాండూరు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. తాండూరు-హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని నవాబుపేటలో నిర్వహించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య, ఎంపీటీసీ ఎండీ ఇగ్బాల్‌, పోలీసు మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


  • రాజీవ్‌గాంధీకి మేడ్చల్‌ నాయకుల నివాళి

కీసర/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర రూరల్‌/మేడ్చల్‌ అర్బన్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఘన నివాళి అర్పించారు. పార్టీ కీసర మండల అధ్యక్షుడు కోల కృష్ణ రాజీవ్‌ చిత్రపటానికి పూల మాలలు వేశారు. మేడ్చల్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాజీవ్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. జెడ్పీలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ హరివర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ తోటకూ ర వజ్రేష్‌ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌, పోచారం, చౌదరిగూడ పంచాయతీల్లో రాజీవ్‌కు నివాళి అర్పించారు. పార్టీ ఘట్‌కేసర్‌ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్‌, చౌదరిగూడ ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మహే్‌షగౌడ్‌, బాబురావు, సుధాకర్‌, నర్సింగ్‌రావు, నాగేష్‌, అనిల్‌, భోజిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మాధవి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నాగారం మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాంపల్లి చౌరస్తాలో రాజీవ్‌కు నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎం.శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్‌ పంగ హరిబాబు, అశోక్‌యాద వ్‌, రమేష్‌, అనిల్‌యాదవ్‌, విగ్నేష్‌, శ్రీశైలం, స్వప్న, రాం రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సంతోష్‌, బాలేష్‌, శ్రీశైలంగౌ డ్‌, రమేష్‌, బాబూరావు, కిట్టు, సతీష్‌, అర్వింద్‌, విజయ్‌ పాల్గొన్నారు. వజ్రే్‌షయాదవ్‌ ఆధ్వర్యంలో కాచవానిసింగా రం, ఎదులాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌, వైస్‌ఎంపీపీ జంగమ్మ, ఘణాపూర్‌ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, ఎం పీటీసీ జి.రవి, మహే్‌షగౌడ్‌, ఉపసర్పంచ్‌ గీత, నవీన్‌, శ్యామ్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, అమర్‌, సత్తయ్య, నర్సింహ, రమేష్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నం దికంటి శ్రీధర్‌, పీసీసీ అధికార ప్రతినిధి హరివర్ధన్‌రెడ్డిల ఆధ్వర్యంలో శామీర్‌పేట మండలం తూంకుంట, హకీంపేట, దేవరయంజాల్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి మ ండలం కొల్తూరుల్లో రాజీవ్‌గాంధీకి విగ్రహాలకు, ఫొటోలకు నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వస్తేనే అన్ని కులాలు, మతాల సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు.

Updated Date - 2022-05-22T05:46:56+05:30 IST