కాణిపాక ఆలయ అభివృద్ధికి కృషి : ఈవో వెంకటేశు

ABN , First Publish Date - 2020-06-06T10:24:30+05:30 IST

అందరి సహకారంతో కాణిపాక ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఈవో వెంకటేశు

కాణిపాక ఆలయ అభివృద్ధికి కృషి : ఈవో వెంకటేశు

ఐరాల(కాణిపాకం), జూన్‌ 5: అందరి సహకారంతో కాణిపాక ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఈవో వెంకటేశు తెలిపారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా డిప్యూట్‌ కలెక్టర్‌ స్థాయిలో ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్న మొదటి వ్యక్తి వెంటకటేశు.


అలాగే ఈవోగా పనిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులలో ఈయన మూడో వ్యక్తి కావడం విశేషం. కాగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి కాణిపాకానికి చెందిన శాంతిసాగర్‌రెడ్డి థర్మల్‌ స్కానర్లు, మాస్కులను శుక్రవారం వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, ఏసీ కస్తూరి, ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T10:24:30+05:30 IST