సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించండి: జేసీ

ABN , First Publish Date - 2021-03-04T05:22:41+05:30 IST

ఎన్నికలు సజావు గా జరగడానికి సహకరించాలని జేసీ శ్రీనివాసరావు కోరారు.

సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించండి: జేసీ
పలాసలో స్ర్టాంగ్‌ రూమ్‌ పరిశీలిస్తున్న జేసీ

పలాస: ఎన్నికలు సజావు గా జరగడానికి సహకరించాలని జేసీ శ్రీనివాసరావు కోరారు. బుధవారం పలాస జూనియర్‌ కళాశాలలో ఏర్పా టు చేసిన స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలను జేసీ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాంగ్‌ రూముల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. మునిసిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట కమిషనర్‌ రాజగోపాలరావు, ఎంపీడీవో రమేష్‌ నాయుడు, టీపీఎస్‌ భాస్కర్‌ ఉన్నారు.
అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి
మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని  జిల్లా ఎన్నికల పరిశీలకుడు చక్రవర్తి ఆదేశించారు. పలాస- కాశీబుగ్గ మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల పరిశీలకుడు చక్రవర్తి ఆరాతీశారు. బుధవారం ఆయన మునిసిపల్‌ కార్యాలయంలో పరిశీలించి పోలింగ్‌ కేంద్రాలు, బందోబస్తు, స్ట్రాంగ్‌రూములు, కౌంటింగ్‌ కేంద్రాల తీరు,ఎన్నికల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌ధనుంజయ్‌, కమిషనర్‌ రాజగోపాలరావు, తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, ఎంపీడీవో రమేష్‌ నాయుడు, ఆర్వోలు పాల్గొన్నారు.
సచివాలయాల్లో వినతులు స్వీకరించండి
నందిగాం:
గ్రామ సచివాలయాల్లో మధ్యాహ్నం వేళ వినతులు స్వీకరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఈమేరకు బుధవారం పెద్దతామరాపల్లి గ్రామసచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయపన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వినతులు రూపంలో స్వీకరించి తద్వారా పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జియోట్యాగింగ్‌, మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, సచివాలయ కన్వీనర్‌ కె.శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-03-04T05:22:41+05:30 IST