పారిశుధవైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-06-30T11:28:09+05:30 IST

వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు అందరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ కె.రమేశ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని రెడ్‌జోన్‌లో పారిశుధ్య

పారిశుధవైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు సహకరించాలి

భీమవరం టౌన్‌, జూన్‌ 29: వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు అందరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ కె.రమేశ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని రెడ్‌జోన్‌లో పారిశుధ్య పనులను సోమవారం పరిశీలించారు. 24వ వార్డులో పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో మునిసిపల్‌ సిబ్బంది, వలంటీర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. 23, 14, 37 వార్డుల్లో కూడా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


ప్రత్యేక పారిశుధ్య పనులు

పెనుమంట్ర మండలం నెలమూరులో కరోనా కంటైన్మెంట్‌ జోన్‌లో సోమవారం ప్రత్యేక పారిశుధ్య పనులను తహసీల్దార్‌ వై.దుర్గకిశోర్‌, ఎంపీడీవో ఆర్‌ విజయరాజు పర్యవేక్షించారు. కరోనా పాజిటివ్‌ కేసు నమోదన ప్రాంతం నుంచి 200 మీటర్లు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలను నిషేధించామని తెలిపారు. గ్రామంలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కుర్లు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబంలోని పది మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, సెకండరీ కాంట్రాక్టు కింద 35 మందికి మంగళవారం పరీక్షలు చేస్తారని తెలిపారు.


ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనుమానం ఉన్నవారు 104కు కానీ, ఆరోగ్య సిబ్బందికి గానీ తెలియచేస్తే పరీక్షలు చెయ్యటానికి చర్యలు తీసుకుంటామని మండల వైద్యాధికారిణి అనుషా తెలిపారు. కంటోన్మెంట్‌ జోన్‌లో ఉన్న కుటుంబాలకు నిత్యవసర వస్తువులను గ్రామ వలంటీర్ల ద్వారా అందజేస్తామని తెలిపారు.

Updated Date - 2020-06-30T11:28:09+05:30 IST