రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-09-29T06:11:31+05:30 IST

డిండి ఎత్తిపో తల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ కోరారు.

రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు 

చింతపల్లి,మునుగోడు, హాలియా,సెప్టెంబరు 28: డిండి ఎత్తిపో తల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ కోరారు. బుధవారం చింతప ల్లి మండల కేంద్రంలోని సర్వేనెంబర్‌ 154 ప్రభుత్వభూమిని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్‌లకింద భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతుల కోసం ప్రభుత్వ భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. 154సర్వేనెంబర్‌లో గతంలో తొమ్మిది ఎకరాల భూమిని సర్వేచేసి గొట్టిముక్కల రిజర్వాయర్‌ కింద భూములు,ఇళ్లు కోల్పోయిన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.ఆయన వెంట దేవరకొండ ఆర్డీవో కె.గోపిరాం, తహసీల్దార్‌ సీహెచ్‌ విసాలాక్ష్మీ, డిప్యూటీ తహసీల్దార్‌ ఉమ, ఆర్‌ఐ యాదయ్య, సర్వేయర్‌ రతన్‌లాల్‌ పాల్గొన్నారు. అదే విధంగా మునుగోడులో ఓటరు జాబితాపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 


సీఏంఆర్‌ను వేగవంతం చేయాలి

ఖరీఫ్‌, రబీ 2021-22 సీఏంఆర్‌ డెలివరీలను మిల్లర్లు వేగవంతం చే యాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. హాలియాలోని లక్ష్మి నర్సింహాగార్డెన్స్‌లో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పౌర సర ఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ నాగేశ్వరరావు, ఎఫ్‌సీఐ నల్లగొండ మేనేజర్‌ ప్రేమ్‌చంద్ర పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T06:11:31+05:30 IST