‘సారా నియంత్రణకు సహకరించండి’

ABN , First Publish Date - 2022-05-29T06:02:34+05:30 IST

ఏజెన్సీలో సారా తయారీ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్‌ఈబీ ఏసీ కె.శ్రీనివాసరావు అన్నారు. కొండలోగాం గ్రామంలో శనివారం పోలీసులు, సచివాలయ సిబ్బంది, గిరిజనులతో కలిసి పరివర్తన 2.0 సమావేశం నిర్వహించారు.

‘సారా నియంత్రణకు సహకరించండి’
గిరిజనులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పోలీసులు

హరిపురం: ఏజెన్సీలో సారా తయారీ నియంత్రణకు ప్రతి ఒక్కరూ  సహకరించాలని ఎస్‌ఈబీ ఏసీ కె.శ్రీనివాసరావు అన్నారు. కొండలోగాం గ్రామంలో శనివారం పోలీసులు, సచివాలయ సిబ్బంది, గిరిజనులతో కలిసి పరివర్తన 2.0 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సారాతో కలిగే నష్టాలను వివరించారు. తయారీ, అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ సీఐ వెంకటప్పలనాయుడు, సోంపేట సీఐ రవిప్రసాద్‌, ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-29T06:02:34+05:30 IST