నిబంధనలకు విరుద్ధంగా.. బెల్లం విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-20T05:46:50+05:30 IST

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్లం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హె చ్చరించారు. మదనపల్లె పట్టణంలోని ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ దుకాణాల్లో గురువారం వన్‌టౌన్‌, టూటౌన్‌, ఎస్‌ఈబీ పోలీసులు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా దుకాణాల్లో బెల్లం నిల్వలను పరిశీలించి, స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మా ట్లాడుతూ దుకాణాల్లో పది కేజీలకు మించి బెల్లం కొనుగోలు చేసే వారి ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, పూర్తి చిరునామా నమోదు చేయడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా.. బెల్లం విక్రయిస్తే చర్యలు
తనిఖీలు చేస్తున్న పోలీసులు

దుకాణాల్లో పోలీసుల తనిఖీలు   

పలు షాపులకు నోటీసుల జారీ

మదనపల్లె క్రైం, మే 19: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్లం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హె చ్చరించారు. మదనపల్లె పట్టణంలోని ట్రేడర్స్‌, హోల్‌సేల్‌ దుకాణాల్లో గురువారం వన్‌టౌన్‌, టూటౌన్‌, ఎస్‌ఈబీ పోలీసులు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా దుకాణాల్లో బెల్లం నిల్వలను పరిశీలించి, స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మా ట్లాడుతూ దుకాణాల్లో పది కేజీలకు మించి బెల్లం కొనుగోలు చేసే వారి ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, పూర్తి చిరునామా నమోదు చేయడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్‌సేఫ్టీ ధ్రువపత్రం లేని షాపులకు నోటీసులు జారీ చేశారు. సారాపై సమరం కార్యక్రమంలో భాగంగా దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐలు ఈదురుబాషా, మురళీకృష్ణ, ఎస్‌ఈబీ సీఐ మురళీకిశోర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, ఎస్‌ఐలు లోకేశ్‌, చంద్రమోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:46:50+05:30 IST